IND vs SA 2nd T20 : చెలరేగిన క్లాసెన్ ఇండియా పరేషాన్
46 బంతులు 81 పరుగులు 7 ఫోర్లు 5 సిక్సర్లు
IND vs SA 2nd T20 : రిషబ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు మరోసారి ఓడి పోయింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు దెబ్బకు ఠారెత్తింది. కటక్ వేదికగా జరిగిన రెండో టి20 లోను ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 4 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది.
149 పరుగుల స్వల్ప టార్గెట్ తో మైదానంలోకి దిగిన సఫారీ టీం 18.2 ఓవర్లలోనే కథ ముగించింది. మొదటి టీ20 మ్యాచ్ లో కిల్లర్ మిల్లర్ , వారెన్ డసెన్ రెచ్చి పోతే ఈసారి హెన్రిచ్ క్లాసెన్ దంచి కొట్టాడు.
భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 46 బంతులు మాత్రమే ఆడిన క్లాసెన్ 81 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. షాన్ దార్ ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు.
ఎక్కడా తగ్గకుండా ప్రారంభం నుంచే ధాటిగా ఆడడం మొదలు పెట్టాడు. భారత బౌలర్లు ఏకోశాన ప్రభావం చూపలేక పోయారు. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా సౌతాఫ్రికా 2-0తో ఆధిక్యంలో ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు(IND vs SA 2nd T20) నిర్ణత 20 ఓవర్లలో కేవలం 148 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఆఖరులో వచ్చిన ఫినిషర్ దినేశ్ కార్తీక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
21 బంతులు మాత్రమే ఆడిన కార్తీక్ 2 ఫోర్లు 3 సిక్సర్లతో చెలరేగాడు. 30 పరుగులు చేయడం తో టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
అంతకు ముందు శ్రేయస్ అయ్యర్ 40 పరుగులు చేస్తే ఇషాన్ కిషన్ మరోసారి రాణించాడు. 34 రన్స్ చేసి సత్తా చాటాడు.
Also Read : మనం 21వ శతాబ్దంలోనే ఉన్నామా