South Africa T20 Squad : భారత్ టూర్ కు సఫారీ రెడీ
కెప్టెన్ గా బవూమా ఎంపిక
South Africa T20 Squad : వచ్చే జూన్ నెలలో భారత్ లో పర్యటించే సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(South Africa T20 Squad). ఈ మేరకు కెప్టెన్ గా బవూమాను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. టూర్ లో భాగంగా సఫారీ టీమ్ ఐదు మ్యాచ్ ల టీ20 సీరీస్ ఆడనుంది.
ఇందు కోసం 16 మందితో ఎంపిక చేసినట్లు ప్రకటించింది. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా ఇండియాకు రానుంది(South Africa T20 Squad). విచిత్రం ఏమిటంటే 5 ఏళ్ల తర్వాత పార్నెల్ ను బోర్డు తిరిగి తీసుకుంది.
జూన్ 9 నుంచి ఈ సీరీస్ ప్రారంభం కానుంది. ఇదే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టెంబా బవుమా కు సారథ్య బాధ్యతలు అప్పగించడం చర్చకు దారి తీసింది. ఇక స్టబ్స్ ను తొలిసారిగా ఛాన్స్ ఇచ్చింది.
ఇక ఇప్పటి వరకు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సఫారీకి చెందిన నోర్జేతో పాటు సీనియర్ ప్లేయర్లు హెండ్రిక్స్ , క్లాసెన్ కు జట్టులో చోటు దక్కింది. ఇక జూన్ 9న మొదటి టీ20 ఢిల్లీ వేదికగా జరగనుంది.
12న కటక్ లో, 14న విశాఖపట్నంలో, 17న రాజ్ కోట్ లో , 19న బెంగళూరులో మ్యాచ్ లు జరుగుతాయి. ఇక దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇలా ఉంది.
మొత్తం 16 మందిలో సఫారీ టీమ్ కు బవుమా కెప్టెన్ కాగా, క్వింటన్ డికాక్ , హెండ్రిక్స్ , క్లాసెన్ , కేశవ్ మహరాజ్ , మార్క్మ్, మిల్లర్ , ఎంగిడి, నోర్జే, పార్నెల్, ప్రిటోరియస్ , కగిసో రబడ, షంసీ, స్టబ్స్ , డసెన్, జాన్సెన్ ఉన్నారు.
TeluguISM – ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిదో