Speaker Ayyanna : అటవీశాఖ అధికారులకు సవాల్ విసిరిన ఏపీ అసెంబ్లీ స్పీకర్

అనకాపల్లి జిల్లా సామిల్లుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు...

Speaker Ayyanna : శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు. గత 5 నెలల్లో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామంటూ చెబుతున్న అటవీశాఖ సిబ్బందికి ఆయన సవాలు విసిరారు. గత 5 నెలల్లో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటారని నిరూపిస్తూ రాజీనామా చేస్తానని అన్నారు. సోషల్ ఆడిట్లో 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని పేర్కొన్నారు.

Speaker Ayyanna Comment

రైతులు పొలంలో పెంచుకున్న వేప, టేకు చెట్లు కొట్టాలంటే అనుమతులు కావాలి అని అడుగుతున్న అటవీ శాఖ అధికారులు,, వైసీపీ హయాంలో జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన సమయంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలు, చెట్లను ఏ అనుమతితో నరికేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా సామిల్లుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. దీనికి కొంత మంది అటవీశాఖ అధికారులు సహకరిస్తున్నారని వాటి ఫోటోలు, పేర్ల జాబితాను అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించామన్నారు. ‘‘ మీ పని ఈజీ.. చర్యలు తీసుకోవడానికి ఇక సిద్ధం కండి’’ అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. విద్యార్థినుల ఆందోళనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నానని… హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.‌ ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Also Read : CM Chandrababu : నూజివీడు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై స్పందించిన చంద్రబాబు, లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!