SRH vs GT : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో సమ ఉజ్జీల మధ్య లీగ్ మ్యాచ్ కొనసాగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో జైత్ర సాగిస్తోంది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ .
ఇక అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్(SRH vs GT ). ఇక హైదరాబాద్ 7 మ్యాచ్ లు ఆడి 5 గెలిచి 2 మ్యాచ్ లలో ఓడి పోయింది. ఇక గుజరాత్ టైటాన్స్ ఏడు మ్యాచ్ లు ఆడింది 6 గెలిచింది ఒక దానిలో ఓడి పోయింది.
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో ఉండగా రన్ రేట్ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ మూడో ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక జట్ల విషయానికి వస్తే ఇలా ఉన్నాయి.
గుజరాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోసఫ్ , జేసన్ రాయ్ , జయంత్ యాదవ్ , డొమినిక్ గ్రేక్స్ , గురు కీరత్ సింగ్ , నూర్ అహ్మద్ , ప్రదీప్ సాంగ్వాన్ , సాయి సుదర్శన్ , సదరంగని ఆడతారు.
డేవిడ్ మిల్లర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) షమీ, రషీద్ ఖాన్ , విజయ్ శంకర్ , సాహా, దర్శన్ నాల్కేండే ఆడతారు.యశ్ దయాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ సన్ , శుభ్ మన్ గిల్ , రాహుల్ తెవాతియా, వరుణ్ ఆరోన్ ఉన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేన్ విలిమ్సన్ కెప్టెన్ . ఇక జట్టులో సన్ అబాట్ , రవికుమార్ సమర్ద్ , సౌరభ్ దూబే, ఎయిడెన్ మార్కరమ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.
భువనేశ్వర్ కుమార్ , జగదీశ సుచిత్, పియం గార్గ్, ఫజల్హక్ ఫారూఖీ, రొమారియో షెపర్డ్, టి. నటరాజన్ , శశాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడతారు.
Also Read : రఫ్ఫాడించిన రియాన్ పరాగ్