SRH vs KKR IPL 2023 : సేమ్ సీన్ హైద్రాబాద్ పరేషాన్
కోల్ కతా 6 రన్స్ తో విక్టరీ
SRH vs KKR IPL 2023 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH vs KKR IPL 2023) రాత మారడం లేదు. చివరి ఓవర్ దాకా ఉత్కంఠ భరితంగా సాగింది. మరోసారి వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. దీంతో 6 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.
చివరి దాకా పోరాడింది..ఒత్తిడిని తట్టుకోలేక బోల్తా పడింది. కెప్టెన్ మార్క్రామ్ రాణించినా ఫలితం లేక పోయింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. స్కిప్పర్ నితీశ్ రాణా , రింకూ సింగ్ అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇద్దరూ కలిసి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకున్నారు కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు. ఓ వైపు వికెట్లు రాలుతున్నా మరో వైపు ఇద్దరూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నారు. కానీ స్వంత మైదానంలో మరోసారి తీవ్ర నిరాశకు గురి చేశారు హైదరాబాద్ ఆటగాళ్లు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. శార్దూల్ ఠాకూర్ 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే వైభవ్ అరోరా 32 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. ఇక చివరి ఓవర్ ను కెప్టెన్ నితీశ్ రాణా వరుణ్ చక్రవర్తికి ఇచ్చాడు. అద్భుతమైన బంతులతో బోల్తా కొట్టించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కు అద్భుత విజయాన్ని చేకూర్చి పెట్టాడు.
అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ చివరి దాకా పోరాడింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 40 బంతులు ఆడి 41 రన్స్ చేస్తే హెన్రిచ్ క్లాసెన్ 20 బాల్స్ ఆడి 36 రన్స్ చేశాడు. ఇక మిగతా వాళ్లు ఎవరూ ఆశించిన మేర రాణించలేక పోయారు.
ఐపీఎల్ లో కోల్ కతాకు ఇది నాలుగో విజయం కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఓటమితో ప్లే ఆఫ్ ఆశలు మరింత క్లిష్టతరం చేసుకుంది. ఈ గెలుపుతో కోల్ కతా కు 8 పాయింట్లు దక్కాయి.
Also Read : సత్తా చాటిన రింకూ సింగ్