SRH vs MI IPL 2023 : ముంబై రె’ఢీ’ సన్ రైజర్స్ సై
కీలక లీగ్ పోరుకు సిద్దం
SRH vs MI IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. పరుగుల వరద పారుతోంది. ప్రతి జట్టు విజయం కోసం పోరాడుతోంది. ఇక పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది రాజస్థాన్ రాయల్స్. ఇక 8వ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఢీకొన బోతోంది.
మంగళవారం జరిగే ఈ కీలక పోరులో ఇరు జట్లు పోరాడేందుకు సై అంటున్నాయి. ఇక ఇప్పటి దాకా ముంబై , హైదరాబాద్ చెరో నాలుగు మ్యాచ్ లు ఆడాయి. ఇరు జట్లు 2 గెలిచి 2 మ్యాచ్ లలో ఓడి పోయాయి. తాజాగా జరిగే పోరులో ఎవరిది పై చేయి అవుతుందనేది వేచి చూడాలి.
ముంబై ఇండియన్స్(SRH vs MI IPL 2023) భారీ స్కోర్ ను సులభంగా ఛేదించింది. ఇషాన్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ , తిలక్ వర్మ రాణిస్తుండడం ఆ జట్టుకు లాభం. ఇక రోహిత్ శర్మ సైతం స్కోర్ బోర్డును పరుగెత్తించడంలో సిద్దహస్తుడు. ఇది ఐపీఎల్ లో 25వ మ్యాచ్ . మయాంక్ మార్కండే మరోసారి మ్యాజిక్ చేస్తాడని హైదరాబాద్ భావిస్తోంది.
ఎస్ ఆర్ హెచ్ కు ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక సెంచరీతో కదం తొక్కిన హ్యారీ బ్రూక్ ఉండనే ఉన్నాడు. రాహుల్ త్రిపాఠి అవసరమైన సమయంలో దుమ్ము రేపగలడు. మొత్తంగా ఈ కీలక మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : ఆర్సీబీకి షాక్ చెన్నై ఝలక్