Sri Lanka Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభం ద్వీప దేశం శ్రీలంకను అతలాకుతలం చేసింది. స్వాతంత్రం వచ్చాక ఎన్నడూ లేని రీతిలో దేశం రాజకీయ సంక్షోభంలోకి కూరుకు పోయింది. పాలక వర్గాలు చేసిన తప్పిదాలు దేశాన్ని నిట్ట నిలువునా ముంచే పరిస్థితికి తీసుకు వచ్చింది.
ఆయిల్ తో పాటు నిత్యావసరాలు అందక జనం రోడ్లపైకి వస్తున్నారు. ఇక తనకు చేత కాదంటూ ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా ఇచ్చేశారు.
చావు కబురు చల్లగా చెప్పారు. ఏర్పాట చేసిన మంత్రివర్గం పూర్తిగా పక్కకు తప్పుకుంది.
దేశాధ్యక్షుడు సర్వాధికారులు సైనికులకు అప్పగించారు. పూర్తిగా యావత్ దేశం సంక్షోభాన్ని(Sri Lanka Crisis) ఎదుర్కొంటోంది.
ఈ తరుణంలో తమను అడ్డుకున్నారనే కోపంతో ఊగిపోయిన అధికార పార్టీకి చెందిన ఎంపీని నిరసనకారులు కొట్టి చంపారు.
ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వమే డిక్లేర్ చేసింది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది ఒక్కటే ప్రజాగ్రహం ముందు పాలకులు ఏమీ చేయలేరన్నది స్పష్టమైంది.
పీఎం మద్దతుదారులు , ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
100 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఎంపీ, మాజీ మంత్రి ఇళ్లను టార్గెట్ చేశారు. పూర్తిగా దగ్ధం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఈ అల్లర్లకు, ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు, ప్రధానియేనంటూ సంచలన ఆరోపణలు చేశారు
ఆ దేశ మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేళ జయవర్దనే. దేశ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిన ఘనత వారిదేనంటూ మండిపడ్డారు.
ఇదే సమయంలో మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ దేశం కోసం రావాలంటూ పిలునిచ్చారు. అక్కడి ప్రభుత్వం పూర్తిగా పతనమైంది.
ఇదిలా ఉండగా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే , సోదరుడు మహింద రాజపక్స తమ పేరెంట్స్ కోసం నిర్మించిన స్మారక స్థూపాన్ని ధ్వంసం చేశారు.
కొలంబో నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి ఇంటికి నిప్పంటించారు. ముగ్గురు మాజీ మంత్రులు, ఇద్దరు ఎంపీల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. దీంతో దేశమంతటా కర్ఫ్యూ ప్రకటించారు ప్రెసిడెంట్.
Also Read : భారత్ లో ఐపీఎల్ ఆట కాదు ఓ మతం