Sri Lanka Protest : పాలకుల వైఫల్యాలకు ప్రత్యక్ష నిదర్శనం శ్రీలంక ప్రభుత్వం. రాజ్యాలు, దేశాలు, ప్రభుత్వాలు శాశ్వతం కాదని తెలసుకోక తప్పదు. ఆకలి కేకలు, ఆర్త నాదాలతో దద్దరిల్లుతోంది శ్రీలంక (Sri Lanka) .
పతనం అంచున ఆ దేశం నిలబడింది. దానిని మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉంది. తాజాగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
ఏకంగా దేశ అధ్యక్షుడు రాజపక్స (Rajapaksa) భవనం(Sri Lanka Protest )పై దాడికి బయలు దేరారు.
ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఎక్కడ చూసినా ప్రభుత్వంపై జనాగ్రహం కనిపిస్తోంది.
రాజపక్స (Rajapaksa) దిగి పోవాలంటూ నినాదాలు మార్మోమ్రోగుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు, ఆర్మీ నానా తంటాలు పడుతోంది.
ఇప్పటికే ఖాకీలకు సంబంధించిన బస్సు, జీపు, బైకులు దగ్ధం అయ్యాయి. అర్ధరాత్రి అంతా నిద్ర పోతున్న సమయంలో ప్రజలు బయటకు వచ్చారు.
వేలాది మందిగా తరలి వచ్చారు. కొలంబోలోని అధ్యక్ష భవనం ముందు నిరసనలు చేపట్టారు.
రాజీనామా చేయాలంటూ డిమాండ్ (Sri Lanka Protest )చేశారు. ఒక్క క్షణం ఇక్కడ ఉండేందుకు వీలు లేదంటూ మండిపడ్డారు.
నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. నిలువరించేందుకు ప్రయత్నించిన సమయంలో హింస చోటు చేసుకుంది. ఈ ఆందోళన దేశ వ్యాప్తంగా చెలరేగే అవకాశం ఉంది.
టియర్ గ్యాస్ , వాటర్ క్యాన్ లు ప్రయోగించినా వినిపించు కోలేదు. పెద్ద ఎత్తున వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల దాడులలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదిలా ఉండగా ముందే పసిగట్టిన శ్రీలంక (Sri Lanka) దేశాధ్యక్షుడు రాజపక్స (Rajapaksa) భవనంలో లేరని , ఆయన ఎక్కడో తలదాచుకున్నట్లు సమాచారం. ఈ ఘర్షణకు సంబంధించి 45 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పరిస్థితిని నియంత్రించ లేక పోయినట్లయితే అధ్యక్ష భవనంపై కచ్చితంగా దాడి జరిగి ఉండేది. ఏది ఏమైనా ఇప్పటికైనా పరిస్థితిని అదుపు లోకి తీసుకు వచ్చేందుకు సమాలోచనలు కాదు ఆచరణలోకి వచ్చేలా చేయాల్సిన బాధ్యత శ్రీలంక ప్రభుత్వం (Government) పై ఉంది.
అధికారం శాశ్వతం కాదని తెలుసు కోవాలి. అసంబద్ద నిర్ణయాలు, అశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి , అవినీతికి కేరాఫ్ గా మారింది శ్రీలంకలో.
Also Read : సామాజిక చైతన్య స్ఫూర్తి ప్రదాతల మాసం… ఏప్రిల్