Srisailam : నిన్నటి దాకా రణరంగంగా మారిన ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీశైలంలో (Srisailam)ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. అనుకోని పరిస్థితిలో చోటు చేసుకున్న ఘర్షణను నివారించేందుకు పోలీసులు (Police) భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.
దీంతో గొడవలు సద్దు మణిగాయి. తిరిగి భక్తుల దర్శనం ప్రారంభించింది దేవస్థానం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టారు. పుణ్య క్షేత్రం పుర వీధుల్లో ఎక్కడ చూసినా పోలీసులే (Police) దర్శనం ఇస్తున్నారు.
యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 500 మందికి పైగా ఖాకీలు కొలువు తీరారు. వీరితో పాటు 100 మంది కర్ణాటకకు (Karnataka) చెందిన పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
చోటు చేసుకున్న ఘర్షణ చివరకు కొన్ని దుకాణాలు (Shops) అగ్నికి ఆహుతయ్యాయి. పలు బైకులు, ఫోర్ వీలర్ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది.
టీ స్టాల్ యజమానికి భక్తుడికి మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసానికి దారి తీసింది. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. 20 దుకాణాలకు పైనే ధ్వంసం చేశారు.
40 దాకా వాహనాలు పనికి రాకుండా పోయాయి. డీఎస్పీ స్మృతి ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఘర్షణ వాతావరణం అదుపులోకి వచ్చింది.
ఈ ఘటనకు కారణం ఎవరనే దానిపై పోలీసులు (Police) ఆరా తీస్తున్నారు. విచిత్రం ఏమిటంటే సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయక పోవడమేననే ఆరోపణలు ఉన్నాయి. ఆలయ ఇఓ ఏం చేస్తున్నారనే దానిపై ఈరోజు వరకు ఆన్సర్ లేదు.
Also Read : 3న నెలవంక దర్శనం