TTD Chairman : అమెరికాలో శ్రీవారి కళ్యాణోత్సవాలు
ఈనెల 18 నుంచి ప్రారంభం
TTD Chairman : తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ అమ్మ వార్లకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా.
ప్రతి చోటా ఆయనను కొలిచే భక్తులు కనిపిస్తారు. ఎక్కడికి వెళ్లినా ఏ దేశం వెళ్లినా అక్కడ కొలవడం, ఆరాధించడం, పూజలు జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD Chairman) ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి అమెరికాలోని 7 ప్రాంతాలలో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.
వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ కళ్యాణోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల ఆలయం నుంచే స్వామి వారి విగ్రహాలను, అర్చకులను అమెరికాకు తీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా శ్రీవారి మహా ప్రసాదంగా భావించే తిరుమలలో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలను అక్కడ భక్తులకు అందజేస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్(TTD Chairman).
ఇదిలా ఉండగా వేసవి సెలవులు ముగియడంతో చివరి సారిగా స్వామి, అమ్మ వార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పెద్ద ఎత్తున చేరుకోవడంతో దర్శన సమయం 25 గంటలు పడుతోంది.
ఇందుకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఒక్క రోజే 67, 949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
భక్తులు సమర్పించిన కానుకుల ద్వారా హుండి ఆదాయం రావడం విశేషం. ఇదిలా ఉండగా ఎంత మంది భక్తులు వచ్చినా వారికి ఇబ్బంది లేకుండా కేవలం గంటన్నర లోపే దర్శనం చేయించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు ఇటీవల.
Also Read : నయన్ దంపతులకు టీటీడీ నోటీసు