SS Rajamouli CAA : హాలీవుడ్ ఏజెన్సీతో రాజ‌మౌళి డీల్

పెర‌గ‌నున్న టాలీవుడ్ బ్రాండ్ ఇమేజ్

SS Rajamouli CAA : టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజౌమ‌ళి(SS Rajamouli) మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌స్తుతం భార‌తీయ ద‌ర్శ‌కుల‌లో టాప్ లో కొన‌సాగుతున్నారు.

ఆయ‌న తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డులను తిర‌గ రాసింది. బాహుబ‌లిని త‌ల‌పింప చేసింది. ఇక రాజ‌మౌళి ఏం చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. తెలుగు సినిమా రంగానికి కొత్త సొబ‌గులు అద్దాడు జ‌క్క‌న్న‌.

ఒకానొక స‌మ‌యంలో బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ మూవీలు హాలీవుడ్ మూవీస్ తో పోటీ ప‌డ్డాయి. ఆయ‌న చిత్రం తీసే విధానం భిన్నంగా ఉంటుంది. అది అంత‌ర్జాతీయ స్థాయిలో ఉంటుంది.

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) విస్తు పోయారు. ఆ వెంట‌నే అందులో అద్భుతంగా న‌టించిన న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఆపై హైద‌రాబాద్ లో నోవా టెల్ హోట‌ల్ కు పిలిపించుకుని కంగ్రాట్స్ తెలిపారు. ఈ స‌మావేశంలో బండి సంజ‌య్ కూడా ఉండ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా తాజాగా జ‌క్క‌న్న హాలీవుడ్ కు చెందిన ఏజెన్సీతో చేతులు క‌లిపాడు.

అమెరికాలో లీడింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ తో రాజ‌మౌళి ఒప్పందం చేసుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా లాస్ ఏంజిల్స్ వేదిగా మోస్ట్ పాపుల‌ర్ ఏజెన్సీగా పేరొందింది సీఏఏ(CAA).

సినిమాల ఎండార్స్ మెంట్ , బ్రాండింగ్ , మార్కెటింగ్ తో పాటు వేలాది మంది న‌టీ న‌టులు, డైరెక్ట‌ర్లు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు పెద్ద పీట వేస్తోంది ఈ సంస్థ‌. కాగా రాజ‌మౌళి ప్రిన్స్ మ‌హేష్ బాబుతో ఓ మూవీ చేస్తున్నాడు.

Also Read : రెడ్ హాట్ లో మత్తెక్కిస్తున్న నివేత పేతురాజ్

Leave A Reply

Your Email Id will not be published!