SS Rajamouli KCR : దిగ్గజ దర్శకుడిగా పేరొందిన రాజమౌలి అలియాస్ అంతా ముద్దుగా పిలుచుకునే జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రూపొందించిన ఆర్ఆర్ఆర్ ( రణం-రుధిరం-రౌద్రం) మూవీకి సంబంధించి టికెట్ల ధరలు పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈ సంరద్భంగా కృతజ్ఞతలు తెలియ చేశారు.
సహకరించిన వారికి కూడా థ్యాంక్స్ తెలిపారు దర్శకుడు. మరో వైపు ఏపీ సర్కార్ కూడా ఓకే చెప్పేసింది. ఇక మెగాస్టార్ తమ టికెట్ల రేట్ల విషయంలో చూపిన చొరవ గొప్పదంటూ కితాబు ఇచ్చారు.
ఆయనే తమకు పెద్ద దిక్కుగా అభివర్ణించారు రాజమౌళి(SS Rajamouli KCR ). వీరంతా గంపగుత్తగా జగన్ వద్దకు వెళ్లారు. వారిలో చిరంజీవి, రాజమౌళి, కొరటాల శివ, మహేష్ బాబు, ప్రభాస్ ఉన్నారు.
అంతకు ముందే ఆలీ, పోసాని కృష్ణ మురళి, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తితో పాటు పేర్ని నాని కూడా హాజరయ్యారు. చిరంజీవి తమ కోసం కొంచెం తగ్గారని తెలిపారు. అయితే మెగాస్టార్ మాట్లాడిన తీరు బావోలేదన్న విమర్శలు వచ్చాయి.
ఏది ఏమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాతలు, దర్శకులు, నటీ నటుల వైపు ఉంటాయన్నది మరోసారి రుజువు చేసుకున్నాయి. ఇష్టానుసారం పెంచుకుంటూ పోతే చిల్లులు పడేది మాత్రం ఫ్యాన్స్ కే.
వందల కోట్లు పెట్టి తీయడం. ప్రచారం చేసుకోవడం. ఆపై సర్కార్లతో అంటకాగడం అలవాటుగా మారింది. ఒకరకంగా సినిమా అన్నది వినోదం కాకుండా జూదంలాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏది ఏమైనా టికెట్ల ధరల పెంపుతో ఆర్ఆర్ఆర్ కు కలిసి వచ్చిందనే చెప్పక తప్పదు.
Also Read : మిలటరీ అధికారిగా విజయ్ దేవరకొండ