UP CM : యూపీలో నిరసనకారులపై ఉక్కుపాదం
ఆందోళనకారులను వదలొద్దని ఆదేశం
UP CM : ప్రవక్త మహ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు నిరసన తెలపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM). ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ మేరకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే వాళ్లను పట్టుకుని శిక్షించాలని, వారు బయటకు రాకుండా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
యూపీలోని పలు నగరాలలో శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున నిరసనకారులు బయటకు వచ్చారు. మరొకరిపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి.
దీనిపై సీరియస్ అయ్యారు సీఎం. సీసీ ఫుటేజ్ లు పరిశీలించండి. ఎవరు పాల్గొన్నారో తేల్చండి. వాళ్లను పట్టుకుని శిక్షించండిని పేర్కొన్నారు.
సంఘ విద్రోహ శక్తులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ వద్దని ఆదేశించారు యోగి ఆదిత్యానాథ్(UP CM).
మరో వైపు నియమ నిబంధనలు పాటించని ఇళ్లను కూల్చి వేయడం మళ్లీ మొదలైంది. ఈ మేరకు బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. నిరసనలో పాల్గొన్న ఇద్దరిని గుర్తించి వారి ఇళ్లను కూల్చి వేయడంతో నిరసనకారుల్లో వణుకు మొదలైంది.
ఇదిలా ఉండగా తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా సీఎం ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు సహరాన్ పూర్ లో 64 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ చీఫ్ తెలిపారు.
ప్రధాన నిందితుడు జాఫర్ హయత్ హష్మీకి బంధువైన ఇస్తియాఖ్ అనే వ్యక్తికి చెందిన భవనాన్ని కూల్చి వేశారు. జావేక్ అహ్మద్ ఖాన్ , రహీల్,
సుఫియాన్ లతో పాటు హస్మీకి 72 గంటల పోలీస్ రిమాండ్ ను స్థానిక కోర్టు ఆమోదించింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 230 మందికి పైగా అరెస్ట్ చేశారు. 7 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.
Also Read : పుల్వామాలో లష్కర్ ఉగ్రవాదులు హతం