Mohammed Shami : షోయ‌బ్ అక్త‌ర్ కు ష‌మీ స్ట్రాంగ్ కౌంట‌ర్

భార‌త్ బౌల‌ర్ ట్వీట్ హ‌ల్ చ‌ల్

Mohammed Shami : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ -2022 ను ఎగ‌రేసుకు పోయింది ఇంగ్లండ్(Eng vs PAK T20 World Cup 2022). ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. 138 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. శామ్ క‌ర‌న్, బెన్ స్టోక్ అద్భుతంగా రాణించారు. వికెట్లు తీశారు. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

రెండోసారి మెగా టోర్నీని చేజిక్కించుకుంది ఇంగ్లండ్. టోర్నీలో మొద‌ట త‌డ‌బ‌డింది ఇంగ్లండ్. ఆ త‌ర్వాత అనూహ్యంగా సెమీస్ కు చేరుకుంది. బ‌ల‌మైన భార‌త జ‌ట్టును ఓడించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించింది. కెప్టెన్ జోష్ బ‌ట్ల‌ర్ , హేల్స్ దంచి కొట్టారు.

ఈ త‌రుణంలో పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్‌, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జాతో పాటు మాజీ క్రికెట‌ర్లు షోయ‌బ్ అక్త‌ర్ , వ‌సీం అక్రమ్ , షాహీద్ అఫ్రిది, త‌దిత‌ర ఆట‌గాళ్లు పెద్ద ఎత్తున భార‌త జ‌ట్టుపై(Team India) అవాకులు చెవాకులు పేలారు. అంతే కాదు ర‌మీజ్ ర‌జా చేసిన కామెంట్స్ వివాదాస్ప‌దంగా మారాయి.

భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల గురించి బిలియ‌నీర్లు బోల్తా ప‌డ్డారు. ఈ త‌రుణంలో తాము క‌ప్ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని, ఇంగ్లండ్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తామంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు పాకిస్తాన్ క్రికెట‌ర్లు. ఈ త‌రుణంలో తాజాగా జ‌రిగిన ఫైన‌ల్ లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ చిత్త‌యింది.

దెబ్బ‌కు భార‌త క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇందుకు సంబంధించి స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ(Mohammed Shami) పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇది క‌ర్మ అనుకోవాలంటూ స‌చించాడు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా ఉంది.

Also Read : పాకిస్తాన్ కు బెన్ ‘స్ట్రోక్’ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!