Netflix Loss : నెట్ ఫ్లిక్స్ కు స‌బ్ స్క్రైబ‌ర్ల షాక్

2 ల‌క్ష‌ల మంది గుడ్ బై

Netflix Loss  :  ఇది ఊహించ‌ని దెబ్బ ప్ర‌ముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ కు. కేవ‌లం ఈ 100 రోజుల కాలంలో ఏకంగా నెట్ ఫ్లిక్స్ నుంచి 2,00,000 ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్లు (యూజ‌ర్లు) గుడ్ బై చెప్పేశారు.

దీనికి కార‌ణం ఏమై ఉంటుంద‌ని కంపెనీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ఈ ఏడాది 2022 మొద‌టి త్రైమాసికంలో 221.6 మిలియ‌న్ స‌బ్ స్క్రైబ‌ర్ల‌తో ముగిసింది. గ‌త సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికం కంటే త‌క్కువ.

తాము కోరుకున్నంతగా ఆదాయాన్ని పెంచు కోవ‌డం లేద‌ని, దీనిపై పూర్తిగా ఆలోచిస్తున్న‌ట్లు తెలిపింది నెట్ ఫ్లిక్స్(Netflix Loss ). ఈ విష‌యాన్ని కంపెనీ ప్ర‌క‌టించిన లేఖ‌లో పేర్కొంది. ప్ర‌పంచంలోని ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ ల‌లో టాప్ లో ఉంటూ వ‌స్తోంది నెట్ ఫ్లిక్స్ .

భిన్న‌మైన ప్రోగ్రామ్స్, వెబ్ సీరీస్, మూవీస్ ఇలా ప్ర‌తి రంగాన్ని ట‌చ్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ కంపెనీకి మంచి పేరుంది. దీంతో కంపెనీ ప్ర‌క‌టించిన కొద్ది సేప‌ట్లోనే నెట్ ఫ్లిక్స్ షేర్ల విలువ‌లో నాలుగింట ఒక వంతు న‌ష్ట పోవ‌డం గ‌మ‌నార్హం.

ఒక ద‌శాబ్దంలో ఇంత పెద్ద ఎత్తున స‌బ్ స్కైబ‌ర్ల‌ను కోల్పోవ‌డం కంపెనీకి సంబంధించి ఇదే మొద‌టిసారి. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి చేయ‌డం వ‌ల్ల‌, త‌మ సేవ‌ల‌ను నిలిపి వేయ‌డం కూడా ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వెల్ల‌డించింది నెట్ ఫ్లిక్స్

. 2020 నుంచ 2021 దాకా క‌రోనా ఎఫెక్ట్ కూడా ఓ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలిపింది. మార్కెట్ లో ఇత‌ర కంపెనీల‌తో పోటీ ఉండ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణంగా పేర్కొంది నెట్ ఫ్లిక్స్.

Also Read : స్కిప్ట్ న‌చ్చితే చాలు – హ‌న్సిక‌

Leave A Reply

Your Email Id will not be published!