Kiccha Sudeep : కేంద్ర మంత్రి అమిత్ షా హిందీ భాషపై చేసిన కామెంట్స్ పై యావత్ భారతం భగ్గుమంటోంది. ఒకే భాష ఒకే దేశం ఒకే పార్టీ అనే నినాదంతో చాలా తెలివిగా భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు పోటీ పడి ప్రచారం చేస్తున్నాయి.
మరో వైపు మతం, కులం, ప్రాంతం పేరుతో అల్లర్లు మొదలయ్యాయి. అవి కేవలం ఎన్నికలప్పుడే కొనసాగుతుండడం, ఆ తర్వాత సద్దుమణగడం గమనార్హం. ‘
ఈ తరుణంలో తప్పనిసరైతే తప్ప ఇంగ్లీష్ మాట్లాడకూడదని ఇక నుంచి ప్రతి ఒక్కరు హిందీని తప్పనిసరిగా వాడాలని కోరారు. దీనిపై తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలలో అమిత్ షాపై నిప్పులు చెరిగారు.
ఈ తరుణంలో కర్ణాటకకు చెందిన మాజీ సీఎంలు సిద్దరామయ్య, హెచ్ డీ కుమార స్వామి స్పందించారు. హిందీ భాష గొప్పదని, దానిని వాడాలని చెప్పడాన్ని తాము తీవ్రంగా తప్పు పడుతున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ -2 దుమ్ము రేపింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీనిపై కన్నడ నటుడు సుదీప్ (Kiccha Sudeep)ఆసక్తికర ట్వీట్ చేశాడు.
ఇటీవలి కాలంలో కొన్ని దక్షిణాదికి చెందిన సినిమాలు అద్భుతమైన సక్సెస్ సాధిస్తున్నాయని తెలిపాడు. ఇదే సమయంలో హిందీ ఇక జాతీయ భాష కాదన్నది అర్థమైందని పేర్కొన్నాడు.
దీనిపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ స్పందించాడు. హిందీ జాతీయ భాష కాక పోతే మరి ఎందుకు మీ సినిమాలను డబ్ చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. దీనిపై తీవ్ర అభ్యంతరం, దుమారం చెలరేగింది.
Also Read : జ్యూరీ మెంబర్ గా దీపికా పదుకొనే