Sudha Murty: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ‘సుధామూర్తి’ !

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన 'సుధామూర్తి' !

Sudha Murty: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, ఇన్ఫోసిస్ మాజీ చైర్ పర్సన్ సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ ఖడ్ పార్లమెంట్ హౌస్‌ లోని తన చాంబర్‌లో ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సుధామూర్తి భర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తితో పాటు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ హాజరయ్యారు.

Sudha Murty  Comment

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తిను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. కన్నడ, ఆంగ్ల సాహిత్యానికి సుధామూర్తి ఎంతో కృషి చేశారు. దీనితో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ ఆమె అవార్డులు అందుకున్నారు. టెల్కోలో మొదటి మహిళా ఇంజనీర్‌ గా సుధామూర్తి పని చేశారు. వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్‌ ప్రారంభానికి ప్రధాన కారకురాలు సుధామూర్తి కూడా. సుధామూర్తి కుమార్తె అక్షతా మూర్తి… బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read : Pawan Kalyan : ప్రాణాలకు తెగించి ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను..

Leave A Reply

Your Email Id will not be published!