PBKS vs SRH IPL 2022 : పంజాబ్ ప‌రేషాన్ హైద‌రాబాద్ జోర్దార్

7 వికెట్ల తేడాతో పంజాబ్ పై విక్ట‌రీ

PBKS vs SRH  : గ‌త ఐపీఎల్ లో పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్(PBKS vs SRH )ఇప్పుడు ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ 15వ సీజ‌న్ లో దుమ్ము రేపుతోంది.

స్టార్టింగ్ లో ఓట‌మి పాలైనా ఆ త‌ర్వాత కేన్ మామ సార‌థ్యంలోని స‌న్ రైజ‌ర్స్ స‌త్తా చాటుతోంది. పంజాబ్ కింగ్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 7 వికెట్ల తేడాతో పంజాబ్ ను ఓడించింది.

మొద‌ట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ను అద్బుత‌మైన బౌలింగ్ తో కట్ట‌డి చేశాడు ఉమ్రాన్ మాలిక్. నాలుగు ఓవ‌ర్లు వేసి 28 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

పంజాబ్ ప‌రుగులు తీయ‌కుండా అడ్డుకున్నాడు. ఇక ఆట ఆరంభంలోనే పంజాబ్ త్వ‌ర త్వ‌ర‌గా వికెట్ల‌ను కోల్పోయింది. ఈ స‌మ‌యంలో క్రీజులో ఉన్న లివింగ్ స్టోన్ అద్భుతంగా ఆడాడు.

60 ప‌రుగులు చేశాడు. ఇక శిఖ‌ర్ ధావ‌న్ 8 ప‌రుగులు చేస్తే ప్ర‌భ్ మ‌న్ సింగ్ 14 ర‌న్స్ చేస్తే బెయిర్ స్టో 12 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. జితేశ్ శ‌ర్మ కూడా నిరాశ ప‌రిచాడు.

షారుఖ్ ఖాన్ 26 ప‌రుగులు చేసి కొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 151 ప‌రుగులే చేసి చాప చుట్టేసింది. ఇక 152 ర‌న్స్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ సూపర్ గా ఆడింది.

స్టార్టింగ్ లోనే కేన్ విలియ‌మ్స‌న్ 3 ప‌రుగులే చేసి వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత మ‌ర్క‌ర్ర‌మ్ 41 ర‌న్స్ చేస్తే నికోల‌స్ పూరన్ 35, రాహుల్ త్రిపాఠి 34, అభిషేక్ శ‌ర్మ 31 ప‌రుగుల‌తో రాణించారు. దీంతో 18.5 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని పూర్తి చేసి గెలుపొందింది.

Also Read : డైన‌మెట్ ధోనీతో బంధం ప్ర‌త్యేకం

Leave A Reply

Your Email Id will not be published!