SRH vs GT : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. ఇక గుజరాత్ జట్టులో(SRH vs GT )కెప్టెన్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు.
అభినవ్ మనోహర్ 35 పరుగులు చేసి రాణించాడు. మ్యాథ్యూ వేడ్ 19 రన్స్ చేస్తే సాయి సుదర్శన్ 11, శుభ్ మన్ గిల్ 7 పరుగులకే చాప చుట్టేశారు.
వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా హార్దిక్ పాండ్యా , మనోహర్ కలిసి ఆడడంతో గుజరాత్ టైటాన్స్ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. ఇక చివర్లో వచ్చిన రాహుల్ తెవాటియా 6 పరుగులు చేసి అనవసరమైన రన్ తీసేందుకు వెళ్లి రనౌట్ అయి వెనుదిరిగాడు.
ఇన్నింగ్స్ కు సంబంధించి ఆఖరు ఓవర్ లో సున్నాకే అవుటయ్యాడు ఆఫ్గన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్. దీంతో నిర్ణీత ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు 163 పరుగులు టార్గెట్ గా ముందుంచింది.
ఇదిలా ఉండగా సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ , టి. నటరాజన్ చెరో రెండు వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్ , ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ పడగొట్టాడు.
ఇదిలా ఉండగా గుజరాత్ టైటాన్స్(SRH vs GT )వరుస విజయాలతో జోష్ మీదుంది. ఇక హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొందింది. ఇక సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.
Also Read : కుల్దీప్ సేన్..చహల్ ఆట అద్భుతం