SRH vs RR IPL 2022 : హైద‌రాబాద్ గెలిచేనా రాజ‌స్థాన్ నిలిచేనా

సంజూ శాంస‌న్ వ‌ర్సెస్ కేన్ విలియ‌మ్స‌న్

SRH vs RR IPL 2022 : ఐపీఎల్ 2022 (IPL 2022) లో భాగంగా ఇవాళ మ‌రో కీల‌క మ్యాచ్ కు వేదిక కాబోతోంది. దిగ్గ‌జ ఆట‌గాళ్లు సంజూ శాంస‌న్ , కేన్ విలియ‌మ్స‌న్ (Kane Williamson) సార‌థ్యంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) , స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య పోరు సాగ‌నుంది.

ఈసారి భారీ ధ‌ర‌కు ఆటాళ్ల‌ను కొనుగోలు చేసింది ఎస్ఆర్ హెచ్. 2021 లో దుబాయి వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ (IPL) లో స‌న్ రైజ‌ర్స్(SRH vs RR IPL 2022) దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసి అప‌జ‌యాల‌ను మూట గ‌ట్టుకుంది.

ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కెప్టెన్ గా అద్భుతంగా రాణించినా త‌న జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయాడు.

ఇవాళ ఇరు జ‌ట్లు ఎలా ఆడ బోతున్నాయ‌నే దానిపై ఎక్కువ‌గా ఫోక‌స్. ఇక రాజ‌స్థాన్ ర‌విచంద్ర‌న్ అశ్విన్(SRH vs RR IPL 2022) ను తీసుకుంది.

ఇరు జ‌ట్లు స‌మ ఉజ్జీలుగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ చివ‌రికి ఎవ‌రు గెలుస్తార‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇలా ఉన్నాయి.

మ్యాచ్ ప్రారంభానికి ముందు తుది జ‌ట్ల‌ను ఎంపిక చేస్తారు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) జ‌ట్టుకు సంజూ శాంస‌న్ కెప్టెన్. జోస్ బ‌ట్ల‌ర్ , రాస్సీ వాన్ డ‌స్సెస్ ,

దృవ్ జురెల్, జేమ్స్ నీష‌మ్ , శుభ‌మ్ గ‌ర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయ‌ర్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , య‌జువేంద్ర చ‌హ‌ల్ ఆడ‌నున్నారు.

వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సీద్ కృష్ణ‌, తేజాస్ బ‌రోకా, ఓబెద్ మెకాయ్,

రియాన్ ప‌రాగ్, డారిల్ మిచెల్ , అనున‌య్ సింగ్ , య‌శ‌స్వి జైస్వాల్ , న‌వ‌దీప్ సైనీ, క‌రుణ్ నాయ‌ర్, కేసి క‌రియ‌ప్ప‌, కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కేన్ విలిమ్స‌న్ కెప్టెన్ . ఇక జ‌ట్టులో స‌న్ అబాట్ , ర‌వికుమార్ స‌మ‌ర్ద్ , సౌర‌భ్ దూబే,

ఎయిడెన్ మార్క‌ర‌మ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ సమ‌ద్, అభిషేక్ శ‌ర్మ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ , జ‌గ‌దీశ సుచిత్, పియం గార్గ్,

ఫ‌జ‌ల్హ‌క్ ఫారూఖీ, రొమారియో షెప‌ర్డ్, టి. న‌ట‌రాజ‌న్ , శ‌శాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయ‌స్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడ‌తారు.

Also Read : రాణించిన బ‌డోని..దీప‌క్ హుడా

Leave A Reply

Your Email Id will not be published!