Sunil Gavaskar : 1983ని గుర్తు చేసిన థామ‌స్ క‌ప్ : స‌న్నీ

భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టుపై గ‌వాస్క‌ర్

Sunil Gavaskar : 73 ఏళ్ల సుదీర్ఘ కాలం అనంత‌రం భార‌త బ్యాడ్మింట‌న్ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయం లిఖించింది భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టు. ఏకంగా థాయ్ లాండ్ లో జ‌రిగిన థామ‌స్ క‌ప్ ను ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించి తొలిసారిగా స్వ‌ర్ణ ప‌త‌కాన్ని చేజిక్కించుకుంది.

చ‌రిత్ర సృష్టించింది. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. భార‌త జ‌ట్టును ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ విజ‌యం దేశానికి గ‌ర్వ కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకున్నందుకు గాను భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున రూ. కోటి న‌గ‌దును న‌జ‌రానా కింద ప్ర‌క‌టించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఈ త‌రుణంలో భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ కామెంటేట‌ర్ , 1983లో క్రికెట్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చిన జ‌ట్టులో కీల‌కంగా ఉన్న సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar) స్పందించాడు.

థామ‌స్ క‌ప్ గెలుపొందిన భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. అద్భుతంగా ఆడారంటూ కితాబు ఇచ్చాడు. అంతే కాదు ఆనాటి క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ను సాధించిన 1983ని తిరిగి గుర్తుకు తెచ్చేలా చేశారంటూ పేర్కొన్నాడు.

ఈ చారిత్రాత్మ‌క విజ‌యం ప్ర‌తి ఒక్క‌రికీ స్పూర్తి దాయ‌కంగా నిలుస్తుంద‌న్నాడు సునీల్ మ‌నోహ‌ర్ గవాస్క‌ర్(Sunil Gavaskar). భార‌త పురుషుల బ్యాడ్మింట‌న్ జ‌ట్టు ఆదివారం 14 సార్లు ఛాంపియ‌న్ గా నిలిచిన ఇండోనేషియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త్.

యావ‌త్ భార‌త‌మంతా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతోంది భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టును.

Also Read : రాయుడుది టీ క‌ప్పులో తుపాను

Leave A Reply

Your Email Id will not be published!