Sunil Gavaskar & Pandya : భ‌విష్య‌త్తులో కెప్టెన్ అయ్యే చాన్స్

మాజీ క్రికెట‌ర్ స‌న్నీ కామెంట్స్

Sunil Gavaskar & Pandya : ఐపీఎల్ 2022 ముగిసింది. దేశ వ్యాప్తంగా ఒక‌టే చ‌ర్చ జ‌రుగుతోంది. భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించే స‌త్తా గుజ‌రాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా  కు ఉంద‌ని. అత‌డు జ‌ట్టును ముందుండి న‌డిపించాడు.

బ్యాటర్ గా రాణించాడు. బౌల‌ర్ గా ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. జ‌ట్టు ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో దుమ్ము రేపాడు. ఫైన‌ల్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు చుక్క‌లు చూపించాడు.

కేవ‌లం 17 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆపై జ‌ట్టు కు విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు ర‌న్స్ చేసి. మొత్తంగా అత‌డి నాయ‌క‌త్వం ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా తాజా, మాజీ ఆట‌గాళ్ల‌ను విస్తు పోయేలా చేస్తోంది.

టోర్నీ మొత్తంగా 487 ర‌న్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 44.27గా ఉంది. ఇక బౌల‌ర్ గా 7.27 ఎక‌నామీ రేట్ తో 8 వికెట్లు తీశాడు హార్దిక్ పాండ్యా(Pandya).

భ‌విష్య‌త్తులో గ‌నుక కెప్టెన్సీ విష‌యంలో ఆలోచిస్తే గ‌నుక హార్దిక్ పాండ్యా కు నాయ‌కుడు అయ్యే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar).

28 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన పాండ్యా త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు. పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కూడా అత‌డికే మ‌ద్ద‌తు ప‌లికాడు సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar & Pandya).

ఎంతో నైపుణ్యం దాగి ఉంద‌న్నాడు. రోహిత్ తో స‌మానంగా ఉన్నాడు. వార్న్ లాంటి బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. ఎలైట్ లిస్టులో ధోనీని అధిగ‌మించాడు.

Also Read : శ్ర‌మ‌జీవుల‌కు బీసీసీఐ క్యాష్ ప్రైజ్

Leave A Reply

Your Email Id will not be published!