Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టుకు ఏడేళ్ల పాటు నాయకత్వం వహించి సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచిన విరాట్ కోహ్లీ ఈ మధ్య సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రధానంగా ఆటపై ఫోకస్ పెట్టలేక పోతున్నాడు.
స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే లో తీవ్రంగా నిరాశ పరిచాడు విరాట్ కోహ్లీ. కేవలం 8 పరుగులకే చాప చుట్టేశాడు. హూక్ షాట్ ఆడబోయి వికెట్ పారేసు కున్నాడంటూ మండి పడ్డారు భారత క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar).
కెప్టెన్సీ సమయంలో ఒత్తిడి ఉందనుకుంటే ఓకే కానీ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేనప్పుడు ఆటపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదని ప్రశ్నించాడు.
సఫారీ బౌలర్లు కోహ్లీ ఎక్కడ దొరుకుతాడనేది బాగా ఫోకస్ పెట్టారని దానిని ఇక్కడ విండీస్ బౌలర్లు చేశారంటూ పేర్కొన్నాడు సన్నీ.
బంతితో బౌన్స్ అయ్యేలా చేయడంలో సక్సెస్ కావడంతో కోహ్లీ అనవసరంగా షాట్ ఆడేందుకు యత్నించాడని అందుకే పెవిలియన్ బాట పట్టాడంటూ పేర్కొన్నాడు.
రెండు ఫోర్లు కొట్టాడు. ధాటిగా ఆడతాడని అనుకున్న సమయం లోపే అనవసరంగా అవుట్ కావడం మంచిది కాదని, ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని సూచించాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar).
నాలుగో బంతిని సేమ్ అలాగే ఆడబోయి విండీస్ బౌలర్ కు చిక్కాడంటూ తెలిపాడు. ఇదిలా ఉండగా కోహ్లీ హూక్ షాట్స్ ఆడటంలో కోహ్లీ టాప్ అని కానీ బంతి అనుకున్నంత ఈజీగా రాదన్న విషయం తెలుసు కోవాలన్నాడు.
Also Read : షేక్ రషీద్ పై ఎమ్మెస్కే కామెంట్స్