Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , క్రికెట్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar )సంచలన కామెంట్స్ చేశారు. మొన్నటి దాకా దినేశ్ కార్తీక్ కామెంటేటర్ గా పని చేశాడు.
గత ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం పాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్ మెంట్ చేజిక్కించుకుంది దినేశ్ కార్తీక్ ను. తనపై నమ్మకం పెట్టుకున్న యాజమాన్యం ఆశలను సజీవంగా ఉంచేలా చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ తో ఒంటరి పోరాటం చేసి గెలిపించాడు. ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు దినేశ్ కార్తీక్. ఇప్పటి వరకు టీ20, వన్డేలలో అద్భుతంగా సక్సెస్ రేటు ఉంది.
ప్రస్తుతం దినేశ్ కార్తీక్ వయసు 36 ఏళ్లు. ఈ సందర్భంగా ఫుల్ పర్ ఫార్మెన్స్ కనబరస్తూ వస్తున్న దినేశ్ కార్తీక్ ను బీసీసీఐ సెలెక్షన్ బోర్డు ఎంపిక చేయాలని సూచించాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar ).
దినేశ్ ను ఎంపిక చేసేటప్పుడు అతడి వయసును పరిగణలోకి తీసుకోకూడదని పేర్కొన్నాడు. ఆట ఆడేందుకు వయసు ఎలాంటి అడ్డంకి రాదని అభిప్రాయపడ్డారు
. గతంలో దినేశ్ కార్తీక్ కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. వేలం పాటలో ఆర్సీబీకి వెళ్లాడు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు.
ఈ మధ్య మీడియాతో మాట్లాడిన కార్తీక్ ఆస్ట్రేలియాలో త్వరలో జరిగే టీ20 జట్టులో తాను ఉండాలని అనుకుంటున్నానని, అందుకే ఇంతలా కష్ట పడుతున్నానని చెప్పాడు. ప్రస్తుతం సన్నీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : మాలిక్ టీమిండియాకు ఆడడం ఖాయం