Sunil Gavaskar : కోహ్లీ ఆట తీరు మెరుగు పర్చుకోవాలి
లేక పోతే కష్టమన్న సునీల్ గవాస్కర్
Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో టాప్ ప్లేయర్ గా పేరొందిన భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్ పర్ ఫార్మెన్స్ పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది క్రీడా వర్గాలలో.
గత రెండు ఏళ్లుగా పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్ టూర్ లో భాగంగా రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో ఘోరంగా వైఫల్యం చెందాడు.
మొదటి ఇన్నింగ్స్ లో 11 పరుగులకే చాప చుట్టేశాడు. కీలకమైన రెండో ఇన్నింగ్స్ లో సైతం నిరాశ పరిచాడు. దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనాలంటే ఇదే ఇంగ్లండ్ జట్టుతో జరిగే టీ20, వన్డే మ్యాచ్ లలో సత్తా చాటాల్సి ఉంటుంది.
లేక పోతే చోటు దక్కడం అనుమానమేనని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరిచుకుంది. ఇదే సమయంలో గురువారం సునీల్ గవాస్కర్ కోహ్లీ తన ఆట తీరును మార్చు కోవాలని సూచించాడు.
ఎక్కడ పొరపాటు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకుంటే బెటర్ అని పేర్కొన్నాడు సన్నీ. భారత్ లో కంటే ఇంగ్లండ్ లో పరిస్థితులు వేరుగా ఉంటాయని తెలిపాడు.
తాను కోహ్లీ ఆడే విధానాన్ని చూశానని , ప్రధానంగా బంతిని ముందుగానే ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నాడని అందు వల్లే పరుగులు చేయలేక పోతున్నట్లు స్పష్టం చేశాడు గవాస్కర్(Sunil Gavaskar).
ప్రతి బాల్ ను ఆడాలన్న ఆలోచనను మాను కోవాలని సూచించాడు. అలా అయితేనే పరుగులు చేయవచ్చని చెప్పాడు.
Also Read : బీసీసీఐ సెలెక్టర్లపై పఠాన్ పంచులు