Sunil Gavaskar : బుమ్రాపై స‌న్నీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

అతడు ఏ జ‌ట్టు కైనా ఆడ‌గ‌ల‌డు

Sunil Gavaskar : నిన్న‌టి దాకా జ‌స్ప్రీత్ బుమ్రాపై విరుచుకు ప‌డిన భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar)ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించాడు.

బుమ్రా భార‌త జ‌ట్టుకే కాదు ప్ర‌పంచంలోని ఏ జ‌ట్టుకైనా ఆడ‌గ‌ల స‌త్తా ఉన్నోడ‌ని కితాబు ఇచ్చాడు. స్వ‌దేశంలో వెస్టిండీస్ తో జ‌రిగిన టీ20 సీరీస్ లో భార‌త్ వైట్ వాష్ చేసింది.

ఈ సంద‌ర్బంగా స్పందించాడు స‌న్నీ. జ‌స్ప్రీత్ బుమ్రా పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త స్టార్ ప్లేయ‌ర్ 28 ఏళ్ల బుమ్రాను ఆకాశానికి ఎత్తేశాడు. సామాన్యంగా స‌న్నీ ఎవ‌రినీ ప్ర‌త్యేకించి పొగ‌డ‌డు.

కానీ టీ20 జ‌ట్టులో భార‌త ఆట‌గాళ్లు అద్భుతంగా ఆడారంటూ కితాబు ఇచ్చాడు. ముఖ్యంగా బుమ్రా ఆట తీరు అద్భుతంగా ఉంద‌ని పేర్కొన్నాడు. దీప‌క్ చాహ‌ర్ ను కూడా ప్ర‌స్తావించాడు.

బంతిని రెండు వైపులా స్వింగ్ చేయ‌డం బాగుంద‌ని కితాబు ఇచ్చాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ , మ‌హ్మ‌ద్ ష‌మీ, సిరాజ్ లతో కూడిన మ‌న జ‌ట్టు బ‌లంగా ఉంద‌ని తెలిపాడు.

బుమ్రా అద్బుత‌మైన స్వింగ్ బౌల‌ర్. అత‌నికి అదన‌పు పేస్ కూడా ఉంది. కానీ ఎక్స్ ప్రెస్ చేయ‌డంలో కొంత మొహ‌మాట ప‌డ‌తాడ‌ని తెలిపాడు గ‌వాస్క‌ర్(Sunil Gavaskar).

బంతుల వేగంతో ప్ర‌త్య‌ర్థులు ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ‌తార‌ని అన్నాడు. ఇన్ స్వింగ‌ర్ తో పాటు అవుట్ స్వింగ‌ర్ కూడా వేయ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగి ఉండడం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొన్నాడు. ఇది భార‌త జ‌ట్టుకు అద‌న‌పు బ‌లమ‌ని స్ప‌ష్టం చేశాడు.

Also Read : త‌ప్పుకున్నా జోరు త‌గ్గ‌ని కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!