Sunil Gavaskar : తెలంగాణ స్టార్ పై స‌న్నీ కామెంట్స్

తిల‌క్ వ‌ర్మ భార‌త జ‌ట్టుకు ఖాయం

Sunil Gavaskar : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. సీనియ‌ర్లు స‌త్తా చాటితే కొంద‌రు ఆట‌గాళ్లు ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడారు.

ఇక హైద‌రాబాద్ కు చెందిన తెలంగాణ స్టార్ ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఓ వైపు ఆడ‌లేక చేతులెత్తేస్తే క్లిష్ట స‌మ‌యంలో అద్భుతమైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు.

అంతే కాదు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ప‌రువు పోకుండా కాపాడాడు. ప్ర‌ధాన‌మైన బౌల‌ర్ల‌ను ఎదుర్కొని ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. ఈ త‌రుణంలో భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు తిల‌క్ వ‌ర్మ గురించి.

ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ క‌ష్ట ప‌డితే భ‌విష్య‌త్తులో భార‌త జ‌ట్టుకు ఆడ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు. ఈ త‌రుణంలో భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట్ దిగ్గ‌జం,

ప్ర‌ముఖ వ్యాఖ్యాత సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు తిల‌క్ వ‌ర్మ ఆట తీరుపై. టీమిండియాకు క‌చ్చితంగా ఆడ‌డం ఖాయ‌మ‌న్నాడు. తీవ్ర‌మైన ఒత్తిడి లోనూ చాలా కూల్ గా ఆడుతున్నాడ‌ని కితాబు ఇచ్చాడు.

చెన్నై సూప‌ర్ కింగ్స్ తో అద్భుతంగా ఆడాడు. ఎక్క‌డా తొట్రు పాటుకు గురి కాకుండా ఆడ‌డం బిగ్ అడ్వాంటేజ్ అని పేర్కొన్నాడు స‌న్నీ. తిల‌క్ వ‌ర్మ అన్ని ఫార్మాట్ ల‌లో ఆడే స‌త్తా క‌లిగి ఉన్నాడ‌ని పేర్కొన్నాడు గ‌వాస్క‌ర్(Sunil Gavaskar).

ప్ర‌ధానంగా ఫిట్ నెస్ క‌లిగి ఉండాల‌ని సూచించాడు. ఇషాన్ కిష‌న్, రోహిత్ శ‌ర్మ లాంటి ఆట‌గాళ్లు ఇబ్బంది ప‌డుతుంటే తిల‌క్ వ‌ర్మ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడి పేరు పొందాడు.

Also Read : భార‌త్ టూర్ కు స‌ఫారీ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!