Sunil Gavaskar : పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ గెలవడం కష్టం
భారత మాజీ కెప్టెన్ సునీల్ మనోహర్ గవాస్కర్
Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 లో ఏ జట్టుకు విజయావకావాలు ఉన్నాయనే దానిపై స్పందించాడు.
మిగతా జట్లు కొంత మేరకు పోటీ ఇవ్వగలిగినా ఈసారి ఎలాంటి అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందంటే అది పంజాబ్ కింగ్స్ అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా 2021 సీజన్ వరకు ఎనిమిది జట్లు పాల్గొంటుండగా ఈసారి రెండు జట్లతో కలిపి 10 జట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అయితే పంజాబ్ కింగ్స్ అద్భుతాలు సృష్టించే అవకాశం లేక పోలేదన్నాడు. దిగ్గజ జట్లు ఈసారి హోరా హోరీగా తలపడనున్నాయని ఈ సమయంలో ఆ జట్టు నుంచి అద్బుతాలు ఆశించ లేమన్నాడు గవాస్కర్(Sunil Gavaskar).
ఇతర జట్లను ప్రభావితం చేసేంత సీన్ కింగ్స్ జట్టు ప్లేయర్లకు లేదన్నాడు. అయితే ఏ జట్టుపై వత్తిడి తక్కువగా ఉంటుందో ఆ జట్టు ఎలాంటి వత్తిడికి లోను కాకుండా మంచి ఫలితాలు సాధించేందుకు వీలు కలుగుతుందన్నాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar).
అయితే టీ20 ఫార్మాట్ లో ఏ జట్టు ఎప్పుడు ఎలా గెలుపు సాధిస్తుందో ఎవరూ చెప్పలేరని పేర్కొన్నాడు . ఇదిలా ఉండగా ఈ జట్టుకు మయాంక్ అగర్వాల్ నాయకత్వం వహిస్తున్నాడు.
ఈసారి జానీ బెయిర్ స్టో , రబడ, లివింగ్ స్టోన్ , షారుఖ్ ఖాన్ , శిఖర్ ధావన్ ను తీసుకుంది. ఎందుకనో ఆ జట్టుపై నమ్మకం ఉంచ లేక పోయాడు గవాస్కర్.
Also Read : సత్తా ఉన్నోడు మయాంక్ అగర్వాల్