Sunil Gavaskar : ఐపీఎల్ 2022లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో మ్యాచ్ లో ఇద్దరు లేదా ముగ్గురు కీలకంగా మారుతున్నారు. గతంలో కంటే ఈసారి ఐపీఎల్ లో విశేషాలు, ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారడం విశేషం.
ఇక ఈ రిచ్ లీగ్ లో ఎక్కువగా పాపులర్ గా మారిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్రాన్ మాలిక్. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మనోడు మరోసారి మెరిశాడు.
అద్భుతమైన బంతులతో ఇబ్బంది పెట్టాడు. ఒకానొక దశలో మాలిక్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. మనోడు వేసిన ఆఖరి ఓవర్ ఆ మ్యాచ్ కే హైలెట్. ఇక లీగ్ మ్యాచ్ లో 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు.
ఈసందర్భంగా ఉమ్రాన్ మాలిక్ జమ్మూ కశ్మీర్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో జరిగిన ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓన్ చేసుకుంది. తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన 2022 లో మెగా ఐపీఎల్ వేలంలో తిరిగి రిటైన్ చేసుకుంది.
తనపై ఉంచిన నమ్మకాన్ని మనోడు నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వేగవంతమైన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఏకంగా ప్రతి బంతిని 153 కిలోమీటర్ల వేగంతో బంతిని వేయడం అతడికే చెల్లింది.
ఈ సమయంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సంచలన కామెంట్స్ చేశాడు. భారత జట్టులో ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కడం ఖాయమని జోష్యం చెప్పాడు.
Also Read : చహల్ మ్యాజిక్ బౌలింగ్ మెస్మరైజ్