Sunitha Singer : మా ఆయ‌న ముస‌లోడు కాదు మ‌గాడు

నిప్పులు చెరిగిన సింగ‌ర్ ఉప‌ద్ర‌ష్ట సునీత‌

Sunitha Singer : ప్ర‌ముఖ గాయ‌ని సునీత రెండో పెళ్లి చేసుకుంది. ఆయ‌న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రామ్. ఓ వైపు ప్రొఫెష‌న్ ప‌రంగా బిజీగా ఉంటూనే మ‌రో వైపు సోష‌ల్ మీడియాలో కూడా అంద‌రి లాగానే బిజీగా ఉంటుంది సునీత‌.

తాజాగా ఆమె చేసిన పోస్ట్ పై నెటిజ‌న్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆమె భ‌ర్త రామ్ ను ముస‌లి మొగుడు అంటూ పేర్కొన‌డంపై తీవ్రంగా స్పందించి సునీత‌(Sunitha Singer).

ఇది మంచి ప‌ద్ద‌తి కాదంటూ సూచించారు. మా ఆయ‌న గురించి, ఆయ‌న స‌త్తా గురించి త‌న‌కు తెలుసు మీకేం తెలుసు అంటూ కౌంట‌ర్ ఇచ్చారు ఈ గాయ‌ని.

విమ‌ర్శ‌లు చేసిన వారికి కోలుకోలేని రీతిలో కౌంట‌ర్ ఇచ్చారు. త‌న భ‌ర్త శ్రీ‌రాముడ‌ని, ఆయ‌నపై ఎవ‌రు కామెంట్ చేసినా లేదా త‌క్కువ చేసి మాట్లాడినా ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చింది.

ప్ర‌తి ఒక్క‌రికి కొన్ని లిమిట్స్ ఉంటాయ‌ని, అవ‌త‌లి వారిని కించ ప‌రిచేలా మాట్లాడితే స‌హించ‌బోనంటూ సీరియ‌స్ అయ్యింది ఈ సింగ‌ర్. తామిద్ద‌రం అర్థం చేసుకున్నాం. ఒక్క‌ట‌య్యాం. ఇది త‌ప్పు ఎలా అవుతుంది.

మా పిల్ల‌లకు లేని అభ్యంత‌రం మీకు ఎందుకు అంటూ నిల‌దీసింది సునీత‌(Sunitha Singer). ఇదే స‌మ‌యంలో గాయ‌ని తీవ్రంగా కౌంట‌ర్ ఇవ్వ‌డాన్ని ఆమె అభిమానులు మెచ్చుకున్నారు.

స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు స‌పోర్ట్ గా నిలిచిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు సింగ‌ర్ సునీత‌.

నేను ఎవ‌రినీ ద్వేషించ‌ను. ప్రేమ‌గా ఉండాల‌ని కోరుకుంటాను. వ్య‌క్తిగ‌తంగా దూషించే గుణం నాది కాదంటూ పేర్కొంది. ఏది ఏమైనా మా ఆయ‌న బంగారం. ఆయ‌న ముస‌లోడు కాదు మ‌గాడు అంటూ పేర్కొంది.

Also Read : 7న ఎఫ్-3 మూవీ సాంగ్ రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!