Super Novas Win : చ‌రిత్ర సృష్టించిన సూప‌ర్ నోవాస్

టీ20 చాలెంజ్ టోర్నీ విక్ట‌రీ

Super Novas Win : మ‌హిళా క్రికెట్ లో అరుదైన ఘ‌న‌త సాధించింది హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని విమెన్స్ జ‌ట్టు. ఓ వైపు పురుషుల ఐపీఎల్ కొన‌సాగుతుండ‌గా మ‌రో వైపు మ‌హిళ‌ల క్రికెట్ కు సంబంధించి బీసీసీఐ తాజాగా టి20 చాలెంజ్ టోర్నీ చేప‌ట్టింది.

తాజాగా హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యం వ‌హిస్తున్న సూప‌ర్ నోవాస్(Super Novas Win) జ‌ట్టు అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. విచిత్రం ఏమిటంటే అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది ఈ జ‌ట్టు. ముచ్చ‌ట‌గా టి20 చాలెంజ్ టోర్నీని వ‌రుస‌గా మూడోసారి చేజిక్కించు కోవడం విశేషం.

ఇదిలా ఉండ‌గా సూప‌ర్ నోవాస్(Super Novas Win) , దీప్తి శ‌ర్మ నాయ‌క‌త్వంలోని వెలాసిటి జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ పుణే వేదిక‌గా జ‌రిగింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగింది.

చివ‌రి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ న‌డిచింది. కేవ‌లం 4 ప‌రుగుల తేడాతో వెలాసిటీ జ‌ట్టుపై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

టి20 చాలెంజ్ క‌ప్ కైవ‌సం చేసుకుంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ ఓడి పోయింది సూప‌ర్ నోవాస్. ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి

165 ర‌న్స్ చేసింది. డాటిన్ దుమ్ము రేపింది.

హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకుంది. కేవ‌లం 44 బాల్స్ ఆడి ఒక ఫోర్ 4 సిక్స్ ల‌తో హోరెత్తించింది. 62 ప‌రుగులు చేసి స‌త్తా చాటింది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ తానేమీ త‌క్కువ కాదంటూ ఆడింది.

29 బంతులు ఆడి 1 ఫోర్ 3 సిక్స్ ల‌తో 43 ర‌న్స్ చేసింది. ప్రియా పుని 2 సిక్స్ ల‌తో 28 ప‌రుగులు చేసి రాణించింది. ఇక దీప్తి శ‌ర్మ , క్రాస్ , బ‌హ‌దూర్

చెరో 2 వికెట్లు తీశారు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన వెలాసిటీ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్టు కోల్పోయి 161 ర‌న్స్ మాత్ర‌మే చేసి ఓట‌మి పాలైంది. కేవ‌లం 4 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

లారా 40 బంతులు ఆడి 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో చెల‌రేగింది. 65 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచినా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయింది.

సిమ్రాన్ 10 బంతులు ఆడి 20 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచింది.

బ‌రిలో ఇద్ద‌రు బాగా ఆడినా జ‌ట్టుకు విజ‌యం చేకూర్చ లేక పోయారు. సూప‌ర్ నోవాస్ బౌల‌ర్లు క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

దీంతో విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు రూ. 25 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ ద‌క్కింది.

Also Read : ఐపీఎల్ టైటిల్ గెలిస్తే రూ. 20 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!