Ravi Shastri : సూపర్ సబ్ రూల్ గేమ్ ఛేంజర్ – రవి శాస్త్రి
భారత జట్టు మాజీ హెడ్ కోచ్ కామెంట్స్
Ravi Shastri : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశారు. పొట్టి ఫార్మాట్ టి20లో కొత్తగా ప్రవేశ పెట్టిన సూపర్ సబ్ రూల్ ను ఆయన స్వాగతించారు.
ఒక రకంగా టి20 ఫార్మాట్ కు గేమ్ ఛేంజర్ కానుందని పేర్కొన్నారు. ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా మహారాజాస్ , టీమ్ వరల్డ్ జెయింట్స్ మధ్య స్పెషల్ బెనిఫిట్ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమైంది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) మొదటిసారిగా సూపర్ సబ్ రూల్ ను ప్రవేశ పెట్టంది. మ్యాచ్ లో ఏదైనా ఇన్నింగ్స్ లో 10 ఓవర్లు పూర్తయిన తర్వాత ప్రతి జట్టుకు ఒక సూపర్ సబ్ స్టిట్యూట్ అందుబాటులో ఉంటుందని ప్రత్యేక నియమం పేర్కొంది.
అయితే ఇందుకు సంబంధించి జట్టు ఆట ప్రారంభానికి ముందు ఈ సూపర్ సబ్ ఆటగాళ్ల పేరును ప్రకటించాల్సి ఉంటుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ నిర్ణయాధికారిగా ఉన్న రవిశాస్త్రి(Ravi Shastri) ఈ నియమాన్ని ప్రవేశ పెట్టడం గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు.
ఇక క్రికెట్ పరంగా టి20 ఆట ప్రతి ఏడాది అభివృద్ది చెందుతోంది. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ లో ఈ రూల్ ను ఉపయోగించుకునే వీలుందని మాజీ హెడ్ కోచ్ అభిప్రాయపడ్డారు.
ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకుంటే లేదా ప్రయత్నం చేయాలని అనిపిస్తే దీన్ని చేసేందుకు ఇదే సరైన ప్రదేశమని పేర్కొన్నాడు రవిశాస్త్రి. లెజెండ్స్ లీగ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది.
గుజరాత్ జెయింట్స్ , ఇండియా క్యాపిటల్స్ , మణిపాల్ టైగర్స్ , భిల్వారా కింగ్స్ పాల్గొంటున్నాయి. 6 వేదికలు 16 మ్యాచ్ లలో 90 మంది క్రికెట్ దిగ్గజాలు పాల్గొంటున్నారు.
Also Read : ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా బౌచర్