Supreme Court Youtuber : యూట్యూబర్ పై ప్రతీకారం ఎందుకు
తమిళనాడు, బీహార్ లను ప్రశ్నించిన సుప్రీం
Supreme Court Youtuber : భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ , జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతటి కక్ష సాధింపు చర్యలు అవసరమా అని ప్రశ్నించింది. యూట్యూబర్ గా సుప్రీంకోర్టు(Supreme Court Youtuber) కఠినమైన చట్టం కింద నిర్బంధించబడింది. నాసా కింద కశ్యప్ ను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారించింది.
ఈ మేరకు తమిళనాడు, బీహార్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. దక్షిణాది రాష్ట్రంలో వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయని నకిలీ వీడియోలను ప్రసారం చేసినందుకు అరెస్ట్ అయిన యూట్యూబర్(Youtuber) మనీష్ కశ్యప్ ను మధురై సెంట్రల్ జైలు నుంచి తరలించ వద్దంటూ తమిళనాడు సర్కార్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 32 కింద కోరిన ఉపశమనం కాకుండా జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధ ఉత్తర్వును సవాల్ చేయాలని పిటిషనర్ కోరుతున్నారు.
పిటిషన్ ను సవరించేందుకు పిటిషనర్ కు అనుమతి ఉందని పేర్కొంది కోర్టు. కశ్యప్ తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే వాదించారు. అరెస్ట్ అయిన యూట్యూబర్ పై తమిళనాడులో ఆరు, బీహార్ లో మూడు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయి. సీజేఐ చంద్రచూడ్ ఇంత ప్రతీకారం అవసరమా అని ప్రశ్నించారు.
Also Read : పేపర్ లీకేజీలో మరో ఇద్దరు అరెస్ట్