Sourav Ganguly Jay Shah : గంగూలీ..జే షాకు సుప్రీంకోర్టు ఊరట
పదవుల కొనసాగింపునకు లైన్ క్లియర్
Sourav Ganguly Jay Shah : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా(Sourav Ganguly Jay Shah) కు ఊరట లభించింది. ఈ మేరకు భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బీసీసీఐ తన ప్రతిపాదిత సవరణలో తన ఆఫీస్ బేరర్లకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ను రద్దు చేయాలని కోరింది. దీని వల్ల సౌరవ్ గంగూలీ, జే షా అధ్యక్ష, కార్యదర్శులుగా కొనసాగేందుకు వీలు కల్పిస్తుంది.
వారు సంబంధిత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లలో ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేశారు. భారత రాజ్యాంగంలో క్రికెట్ నియంత్రణ మండలిలో ప్రతిపాదిత మార్పులను సుప్రీంకోర్టు బుధవారం ఆమోదించింది.
ఇది ప్రస్తుతం కొలువు తీరిన దాదా, జే షాకు సంబంధించి సంబంధిత నిబంధనలను పొడిగించేందుకు వీలవుతుంది. తప్పనిసరి కూలింగ్ ఆఫ్ పీరియడ్ , ఆఫీస్ బేరర్ల పదవీ కాలానికి సంబంధించి బోర్డు తన రాజ్యాంగాన్ని సవరించాలని ఒక అభ్యర్థనలో ఉంచింది.
స్టేట్ అసోసియేషన్ లో ఆరేళ్లు, బీసీసీఐలో(BCCI) ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు నిరంతర పదవీ కాలం కలిగి ఉండవచ్చని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదిలా ఉండగా సౌరవ్ గంగూలీ, జే షాల మూడేళ్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో వారు ఆయా పదవుల్లో మరికొంత కాలం లేదా తమకు తోచినంత కాలం ఉండేందుకు మార్గం సుగమమైంది.
ఈ కీలక కేసును డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది.
Also Read : వన్డే కెప్టెన్సీపై వార్నర్ మొగ్గు