Same Sex Marriage : స్వలింగ వివాహంపై కీలక కామెంట్స్
సమాజానికి అత్యంత ప్రమాదం
Same Sex Marriage : స్వలింగ వివాహాన్ని చట్టబద్దం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలొని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తాము కూడా మనుషులమేనని తమకు కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయని పేర్కొన్నారు.
ధర్మాసనంలో జస్టిస్ లు ఎస్ కే కౌల్ , ఎస్ రవీంద్ర భట్ , పీఎస్ నరసింహ, హిమా కోహ్లీ ఉన్నారు. ఈ అంశంపై గత నెలలో సీజేఐ కనీసం 15 పిటిషన్లను ధర్మాసనానికి పంపారు. కేంద్ర సర్కార్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
సామాజిక చట్ట పరమైన సంస్థను ప్రదానం చేయడం లేదా సృష్టించడం గురించి జరిగే చర్చ ఈ కోర్టు లేదా పార్లమెంట్ వేదికగా ఉండాలా అన్నది ఆలోచించాలి. ఇది ఆ వైపు 5 మంది , ఈ వైపు 5 మంది, బెంచ్ పై ఉన్న ఐదుగురు తెలివైన మనస్సులు చర్చించ గలిగే సమస్య కకాదు.
దక్షిణ భారత దేశంలోని రైతు, ఉత్తరాది వ్యాపారవేత్త అభిప్రాయాల గురించి ఎవరికీ తెలియదు. సమాజంలోని భిన్న లింగ(Same Sex Marriage) సమూహం వలె రాజ్యాంగం ప్రకారం అదే హక్కులు ఉన్నాయి. సమాన హక్కులపై ఉన్న ఏకైక అవరోధం 377 . గత 100 ఏళ్లలో వివాహ భావన అన్నది పూర్తిగా మారి పోయిందని తెలిపారు.
Also Read : జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా