Mukesh Ambani Security : అంబానీకి భ‌ద్ర‌త‌పై ‘సుప్రీం’ విచార‌ణ

సెక్యూరిటీ క‌ల్పించ‌డంపై పిటిష‌న్ దాఖ‌లు

Mukesh Ambani Security : భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ముకేష్ అంబానీకి రాష్ట్ర భ‌ద్ర‌త‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

బెదిరింపుల‌కు సంబంధించిన ప‌త్రాల‌తో రేపు త‌మ ముందు హాజ‌రు కావాల‌ని కేంద్ర హొం శాఖ అధికారుల‌ను హైకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా త్రిపుర హైకోర్టు హోం మంత్రిత్వ శాఖ అధికారుల‌ను పిలిపించ‌డాన్ని కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌తిరేకించింది.

ఇదిలా ఉండ‌గా పారిశ్రామిక‌వేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani Security) , ఆయ‌న కుటుంబానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించిన భ‌ద్ర‌త‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించింది భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం.

అంబానీకి, ఫ్యామిలీకి మ‌రాఠా స‌ర్కార్ భ‌ద్ర‌త క‌ల్పించ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. దీనిని త్రిపుర హైకోర్టు స్వీక‌రించింది. కేంద్రం చేసిన అప్పీల్ ను విచారించేందుకు కూడా సుప్రీంకోర్టు అంగీక‌రించింది.

ఒక కుటుంబానికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డం అనేది ప్ర‌జా ప్ర‌యోజ‌నానికి సంబంధించిన అంశం కానే కాదంటూ వాదించింది కేంద్రం. అంబానీ, ఆయ‌న కుటుంబానికి అందించిన సెక్యూరిటీకి వ్య‌తిరేకంగా పీఐఎల్ కు ఎటువంటి ఆధారం లేద‌ని కేంద్రం త‌ప్పుప‌ట్టింది.

కేంద్రం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాదించారు. అంబానీల‌కు క‌ల్పించిన సెక్యూరిటీ గురించి త్రిపుర ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ముఖేష్ అంబానీని బెదిరించిన‌ట్లు ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని త‌మ ముందు స‌మ‌ర్పించాల‌ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు.

Also Read : రానా అయ్యూబ్ కు ట్విట్ట‌ర్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!