Supreme Court Panel : అదానీ గ్రూప్‌కు ‘సుప్రీం’ క్లీన్ చిట్
అమాంతం పెరిగిన షేర్ల విలువ
Supreme Court Panel : గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న దిగ్గజ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి ఊరట లభించింది. అదానీ గ్రూప్ కు సుప్రీంకోర్టు ప్యానెల్(Supreme Court Panel) క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రాథమికంగా ఎలాంటి ఉల్లంఘన లేదని పేర్కొంది. సదరు సంస్థ నుంచి ఎలాంటి ధరల తారుమారు జరగలేదని, రిటైల్ ఇన్వెస్టర్లను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ఆరోపణలు కలకలం రేపాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నిపుణుల బృందాన్ని నియమించింది. ఈ ప్యానెల్ కమిటీ పర్యవేక్షించింది. చివరకు అలాంటిది ఏమీ జరగలేదంటూ తీర్పు చెప్పింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నియంత్రణలో ఎలాంటి వైఫల్యం లేదని పేర్కొంది.
గ్రూప్ తీసుకున్న ఉపశమన చర్యలు స్టాక్ పై విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయ పడ్డాయని, స్టాక్ లు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్యానెల్ తెలిపింది.
గ్రూప్ తీసుకున్న ఉపశమన చర్యలు స్టాక్‌పై విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడ్డాయి మరియు స్టాక్‌లు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని ప్యానెల్ తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదికకు ముందు కొన్ని సంస్థలు షార్ట్ పొజిషన్ తీసుకున్నాయని, నివేదిక తర్వాత ధర పతనమైన తర్వాత లాభ పడ్డాయని సెబీ విచారణలో తేలిందని ఇటీవలే కోర్టుకు తన పరిశోధనలను సమర్పించిన కమిటీ వెల్లడించింది. అక్రమ వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి నమూనా కూడా వెలుగులోకి రాలేదని తెలిపింది.
Also Read : RS Praveen Kumar