Barak Obama : సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం – ఒబామా
మహిళా స్వేచ్ఛను హరించడమే
Barak Obama : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన తీర్పుపై నిరసన వ్యక్తం అవుతోంది. మహిళలకు సంబంధించిన అబార్షన్ హక్కుల్ని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.
దీనిపై ఇప్పటికే దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో(Barak Obama) పాటు కెనడా పీఎం జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మహిళలపై దాడిగా పేర్కొన్నారు.
అత్యంత విచారకరమైన రోజుగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యుఎస్ కోర్టు తీర్పుపై పెద్ద ఎత్తున స్పందన వ్యక్తం అవుతోంది. నిరసన తీవ్ర స్థాయిలో పెల్లుబుకింది.
లక్షలాది మందికి అవసరమైన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు దాడి చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు బరాక్ ఒబామా. అమెరికాలో అబార్షన్ హక్కును రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇవాళ సుప్రీంకోర్టు దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిన దానికి మంగళం పాడింది. ఒక రకంగా చెప్పాలంటే కావాలని చేసింది.
పూర్వపు పూర్వ స్థితిని తిప్పి కొట్టడమే కాదు, రాజకీయ నాయకులు, సిద్దాంతకర్తల ఇష్టానుసారం ఎవరైనా తీసుకోగల అత్యంత తీవ్రమైన వ్యక్తిగత నిర్ణయాన్ని పక్కన పెట్టిందన్నారు.
ఇది దారుణం, అంతకంటే బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా(Barak Obama). మిలియన్ల మంది అమెరికన్ల స్వేచ్ఛపై నేరుగా దాడి చేసినట్లేనంటూ పేర్కొన్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా ఆయన మండిపడ్డారు. ఇకనైనా తీర్పు వెలువరించే సమయంలో ఆలోచించాలని సూచించారు ఒబామా. ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Also Read : అబార్షన్ హక్కుల రద్దుపై ఆగ్రహం
Protestors at the Supreme Court let out a primal scream pic.twitter.com/h85UuBN1p3
— Kirsten Appleton (@kirstenappleton) June 24, 2022
Today, the Supreme Court not only reversed nearly 50 years of precedent, it relegated the most intensely personal decision someone can make to the whims of politicians and ideologues—attacking the essential freedoms of millions of Americans.
— Barack Obama (@BarackObama) June 24, 2022