YS Jagan Case-SC : మాజీ సీఎం జగన్ కేసులపై ధర్మాసనం సంచలన ఆదేశాలు
తెలంగాణ హైకోర్టులో జగన్ పై దాఖలైన అక్రమాస్తుల కేసుల పర్యవేక్షణ ఆధారంగా..
YS Jagan : మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌పై ఉన్న కేసులపై రోజు వారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, కేసులను బదిలీ చేయాలని జగన్ వేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తెలంగాణ హైకోర్టులో జగన్ పై దాఖలైన అక్రమాస్తుల కేసుల పర్యవేక్షణ ఆధారంగా, కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
YS Jagan Cases – Supreme Court
జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్‌పై కూడా ప్రత్యేక విచారణ అవసరం లేదని కోర్టు పేర్కొంది.
ఇంతకు ముందుగా, సుప్రీం కోర్టు ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు, రోజువారీ విచారణ జరిపించాలని, హైకోర్టు పర్యవేక్షణ చేయాలని, అందువల్ల మరో రాష్ట్రానికి కేసులను బదిలీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం స్పష్టం చేశారు.
Also Read : Bihar CM Nitish Kumar : సీఎం తనయుడు రాజకీయ అరంగేట్రం పై కీలక అప్డేట్