Suresh Raina : రాజస్తాన్ కంటే గుజరాత్ బలంగా ఉంది
స్పష్టం చేసిన క్రికెటర్ సురేష్ రైనా
Suresh Raina : కోట్లాది కళ్లన్నీ అహ్మదాబాద్ వైపు చూస్తున్నాయి. కారణం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ కలిగిన లీగ్ గా పేరొందింది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022. కథ ముగింపు దశకు చేరింది.
ఒకే ఒక్క మ్యాచ్ జరిగితే గత రెండున్నర నెలలుగా జరుగుతూ వచ్చిన ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ ముగుస్తుంది. ఇక ఇప్పటికే భారీ ఎత్తున ఎవరూ ఊహించని రీతిలో 6 వేల మందికి పైగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా పేరొందింది మోదీ స్టేడియం. మరో వైపు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు అమిత్ షా, సీఎం బాఘేల్ , కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు.
ఇప్పటికే బీసీసీఐ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ , బాలీవుడు నటుడు రణ్ వీర్ సింగ్ , వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జానపద కళాకారులు ఈ స్టేడియంలో 45 నిమిషాల పాటు జరిగే ముగింపు వేడుకలలో పాల్గొంటారు.
ఇక తాజా, తాజీ ఆటగాళ్లు ఎవరు గెలుస్తారనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ షేన్ వార్న్ కోసమైనా రాజస్తాన్ గెలవాలని కోరాడు.
అదే సమయంలో తన మనసు మాత్రం గుజరాత్ విజయం సాధించాలని కోరుతుందన్నాడు. ఇక భారత క్రికెటర్ సురేష్ రైనా(Suresh Raina) అయితే రాజస్తాన్ కంటే గుజరాత్ బలంగా ఉందన్నాడు. దానికే కప్పు ఎగరేసుకు పోయే ఛాన్స్ ఉందన్నాడు.
Also Read : వాళ్లతోనే ఫైనల్స్ కు ఆడనున్న రాజస్తాన్