Surya Kumar Yadav : టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా సూర్య
ప్రకటించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
Surya Kumar Yadav : భారత విధ్వంసకర బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా సూర్య కుమార్ యాదవ్ ను మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఈ పురస్కారం పొందిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav). తనకు అవార్డు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. 2022 ఏడాదికి గాను ఈ పురస్కారం దక్కింది సూర్య భాయ్ కి.
తాజాగా ఐసీసీ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆటగాళ్లు పోటీ పడ్డారు. చివరకు ఇంగ్లండ్ కు చెందిన సామ్ కరన్ , పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ , జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా ఉన్నారు. కానీ చివరకు సూర్య కుమార్ యాదవ్ ను వరించంది ఈ అవార్డు.
మొదట్లో తడబడిన సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రపంచంలో ఏ క్రికెటర్ చేయని ఫీట్స్ మనోడు చేస్తున్నాడు. ఎవరికీ అంతు చిక్కని రీతిలో షాట్స్ ఆడుతూ అలరిస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.
కళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపుతుడున్నాడు సూర్య కుమార్ యాదవ్. టీ20 ఫార్మాట్ లో తనకు సాటి లేరని చాటుతున్నాడు. టీ20 లలో క్యాలండర్ ఇయర్ లో 31 మ్యాచ్ లు ఆడాడు. 187.43 స్ట్రైక్ రేట్ తో 1164 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వీటిలో 68 సిక్సర్లు కొట్టాడు.
Also Read : అజ్జూ భాయ్ పై బాసిత్ అలీ కామెంట్స్