ICC Rankings 2022 : ఐసీసీ ర్యాంకింగ్స్ లో సూర్య భాయ్

రెండో స్థానంకు చేరుకున్న స్టార్ క్రికెట‌ర్

ICC Rankings 2022 : భార‌త క్రికెట్ లో అనూహ్యంగా రాణిస్తూ వ‌స్తున్న సూర్య కుమార్ యాద‌వ్ ఆసిస్ తో జ‌రిగిన సీరీస్ లో స‌త్తా చాట‌డంతో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ ప్ర‌క‌టించిన తాజా ర్యాంకింగ్స్(ICC Rankings 2022) లో స‌త్తా చాటాడు.

ఏకంగా బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. ఉప్ప‌ల్ లో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో 5 ఫోర్లు 5 సిక్స‌ర్లతో 69 ప‌రుగులు చేసి భార‌త్ విజ‌యంలో అద్భుత‌మైన పాత్ర పోషించాడు. మూడు టి20 మ్యాచ్ ల‌లో మొత్తం 187 ర‌న్స్ చేశాడు.

ఇదిలా ఉండ‌గా ఇంగ్లండ్ తో జ‌రిగిన రెండో, మూడో నాల్గో టి20 మ్యాచ్ ల‌లో 184 ప‌రుగులు చేసిన పాకిస్తాన్ కు చెందిన స్టార్ ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తిరిగి అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు.

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 13వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. విరాట్ కోహ్లీ మెరుగైన ఆట తీరుతో ఆక‌ట్టుకుని 15వ స్థానానికి ఎగ‌బాకాడు.

ఆస్ట్రేలియాతో జ‌రిగిన సీరీస్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా అక్ష‌ర్ ప‌టేల్ నిలిచాడు. చివ‌రి రెండు మ్యాచ్ ల‌లో 5 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. త‌న ర్యాంకింగ్ ను 18వ స్థానానికి పెంచుకున్నాడు.

ఇక 658 పాయింట్ల‌తో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 10వ స్థానంలో నిలిచాడు. టాప్ 10 బౌల‌ర్ల‌లో ఏకైక భార‌త బౌల‌ర్ గా నిలిచాడు. ఆసిస్ టూర్ తో హార్దిక్ పాండ్యా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో టాప్ 4కి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం శ్రీ‌లంక ఆల్ రండ‌ర్ వ‌నిందు హ‌స‌రంగాతో క‌లిసి నాలుగో స్థానంతో స‌రి పెట్టుకున్నాడు.

Also Read : రెస్టాఫ్ ఇండియా స్కిప్ప‌ర్ గా విహారి

Leave A Reply

Your Email Id will not be published!