Suryakumar Yadav : శ్రీలంక మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ అదరగొట్టిన సూర్య కుమార్

కోహ్లీ ఇప్పటివరకు 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు అందుకున్నాడు...

Suryakumar Yadav : టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక సిరీస్‌లో మెరిశాడు. 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. ఛేదనలో చతికిలపడిన శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న సూర్యకుమార్ “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు.

Suryakumar Yadav..

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న ఆటగాడిగా ఉన్న కోహ్లీ రికార్డును సూర్య(Suryakumar Yadav) సమం చేశాడు. కోహ్లీ ఇప్పటివరకు 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. తాజాగా లభించిన అవార్డుతో సూర్య కూడా 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`లు సాధించాడు. అయితే 16 అవార్డులు అందుకోవడానికి కోహ్లీకి 125 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. సూర్య 69 మ్యాచ్‌ల్లోనే ఆ ఘనత సాధించాడు. వీరి తర్వాత జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా (91 మ్యాచ్‌ల్లో 15 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్‌కు చెందిన మహ్మద్ నబీ (129 మ్యాచ్‌ల్లో 14 సార్లు), రోహిత్ శర్మ (159 మ్యాచ్‌ల్లో 14 సార్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాలో ఉన్నారు. శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. ఆదివారం సాయంత్రం రెండో మ్యాచ్ జరగబోతోంది.

Also Read : YS Sharmila: ఎమ్మెల్యేగా జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి – వైఎస్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!