Suvendu Adhikari : ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా ఉంది
సువేందు అధికారి సంచలన కామెంట్స్
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉపాధ్యాయ నియామక స్కామ్ కు సంబంధించి పార్థ ఛటర్జీ సహాయకురాలి ఇంటిపై దాడి చేసింది ఈడీ. కళ్లు చెదిరే నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నగదు బయట పడింది.
దీనిని ప్రధానంగా హైలెట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి చెందిన నాయకుడు సువేందు అధికారి దాడికి గురైన ఆమెతో పాటు మంత్రి, సీఎం మమతా బెనర్జీ ఉన్న ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఈ సందర్భంగా అందమైన క్యాప్షన్ కూడా జత చేశారు. ఇది శాంపుల్ మాత్రమే ఇంకా సీన్ ముందుందంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం సువేందు అధికారి చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.
ఆయన షేర్ చేసిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. యేతో బస్ ట్రైలర్ హై పిక్చర్ అభీ బాకీ హై ( ఇది కేవలం ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా రావాల్సి ఉంది ) అని పేర్కొన్నారు సువేందు అధికారి(Suvendu Adhikari) .
అర్పితా ముఖర్జీ ఎలా అడ్డగోలుగా కోట్లు కొల్లగొట్టిందో ఫోటోలే సాక్ష్యమని తెలిపారు. గతంలో ఆయన టీఎంసీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత విభేదించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు.
సీఎంపై ఛాలెంజ్ చేసి గెలుపొందారు. సీఎం బీజేపీ అభ్యర్థిగా పేరొందారు. కానీ అనూహ్యంగా టీఎంసీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఇదిలా ఉండగా మంత్రి ఛటర్జీ , విద్యా శాఖ సహాయ మంత్రి పరేష్ సి అధికారి , ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు మాజీ సభ్యుడు మాణిక్ భట్టాచార్య , తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు చేస్తోంది.
Also Read : ఈడీ దాడుల్లో కళ్లు చెదిరే నోట్ల కట్టలు