ED Raid Bengal : ఈడీ దాడుల్లో క‌ళ్లు చెదిరే నోట్ల క‌ట్ట‌లు

బెంగాల్ మంత్రి స‌న్నిహితురాలి నిర్వాకం

ED Raid Bengal : ఈ దేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఎక్క‌డ చూసినా అవినీతి, అక్ర‌మాల గుట్టు ర‌ట్టు అవుతోంది. తాజాగా ప‌శ్చిమ బెంగాల్ లో ఈడీ చేప‌ట్టిన దాడులు(ED Raid Bengal) క‌ల‌క‌లం రేపాయి.

అధికారంలో ఉన్న టీఎంసీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న షార్జా చ‌ట‌ర్జీకి అత్యంత స‌న్నిహితురాలిగా పేరొందిన అర్పిత ముఖ‌ర్జీ ఇంట్లో దాడులు చేప‌ట్టింది ఈడీ. క‌ళ్లు చెదిరేలా నోట్ల క‌ట్ట‌లు గుట్టలు గుట్ట‌లుగా ప‌డి ఉన్నాయి.

ఈ నోట్ల క‌ట్ట‌ల‌ను చూసి ఈడీ అధికారులు విస్తు పోయారు. దాదాపు రూ. 20 కోట్ల‌కు పైగా న‌గ‌దు బ‌య‌ట ప‌డింది. ఈ దాడులు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్ బోర్డుతో పాటు స్కూల్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో నియామ‌కాల‌కు సంబంధించి డ‌బ్బులు చేతులు మారిన‌ట్లు అనుమానిస్తున్నాయి.

గుట్ట‌లుగా పేరుకు పోయిన డ‌బ్బుల్ని లెక్కించేందుకు నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది ఈడీ అధికారుల‌కు. బ్యాంకు అధికారుల సాయంతో వీటిని లెక్క గ‌ట్టారు. పేరుకు పోయిన నోట్ల క‌ట్ట‌ల్లో రూ. 500, రూ. 2,000 నోట్లే కుప్పలుగా ప‌డి ఉన్నాయి.

అంతే కాదు 20 కి పైగా మొబైల్స్ స్వాధీనం చేసుకుంది ఈడీ. మంత్రి స‌న్నిహితురాలితో పాటు విద్యా శాఖ మంత్రి ప‌రేష్ అధికారే, ఎమ్మెల్యే మాణిక్ భ‌ట్టాచార్య తో పాటు ఇత‌రుల ఇళ్ల‌ల్లో ఇంకా ఈడీ దాడులు చేస్తోంది.

అర్పిత ముఖ‌ర్జీ బెంగాలీ, ఒడియా, త‌మిళ సినిమాల్లో న‌టించారు. మ‌రో వైపు వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా ఉన్న పార్థా ఛ‌ట‌ర్జీపై తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : మార్గ‌రెట్ అల్వాకు మ‌మ‌త మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!