Swati Dhingra : ఎన్నారై స్వాతి ధింగ్రాకు కీల‌క ప‌దవి

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ద్ర‌వ్య విధాన క‌మిటీ

Swati Dhingra : ప్ర‌వాస భార‌తీయురాలు, ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త నిపుణురాలిగా పేరొందిన స్వాతి ధింగ్రా (Swati Dhingra) కు కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్ర‌వ్య విధాన క‌మిటీలో చేర‌నున్నారు. మానిట‌రీ పాల‌సీ క‌మిటీ (ఎంపీసీ) కి స‌ల‌హాదారుగా నియ‌మించారు.

ఈ విష‌యాన్ని ఛాన్స‌ల‌ర్ రిషి సున‌క్ వెల్ల‌డించారు. ద్ర‌వ్యోల్బ‌ణం త‌క్కువ‌గా, స్థిరంగా ఉంచేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఎలాంటి ద్ర‌వ్య విధాన చ‌ర్య‌ను తీసుకుంటుందో నిర్ణ‌యించేందుకు ఎంపీసీ బాధ్య‌త వ‌హిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ స్వంత వ‌డ్డీ రేట్ల‌ను నిర్ణయించేందుకు గాను ప్ర‌తి ఏటా ఎనిమిదిసార్లు స‌మావేశం అవుతుంది ఈ క‌మిటీ. ఎల్ఎస్ఈలో ఎక‌నామిక్స్ అసోసియేట్ ప్రొఫెస‌ర్ గా ఉన్నారు.

అంతే కాకుండా సెంట‌ర్ ఫ‌ర్ ఎక‌నామిక్ పెర్ఫార్మెన్స్ ట్రేడ్ ప్రోగ్రామ్ లో అసోసియేట్ గా ఉన్నారు డాక్ట‌ర్ ధింగ్రా. మూడేళ్ల కాలం పాటు ఆమె ఈ ప‌ద‌విలో ఉంటారు. వ‌చ్చే ఆగ‌స్టు 9న మానిట‌రీ పాల‌సీ క‌మిటీలో చేర‌తారు.

ఈ క‌మిటీ తొమ్మిది మంది స‌భ్యుల‌తో కూడుకుని ఉంది. న‌లుగురు స‌భ్యుల‌ను నేరుగా ఛాన్స‌ల‌ర్ ద్వారా నిర్ణీత రూల్స్ కు లోబ‌డి నియ‌మిస్తారు. ఆగ‌స్టు 2016 నుండి ఎంపీసీలో ఉన్న మైఖేల్ సాండ‌ర్స్ ప్లేస్ లో డాక్ట‌ర్ ధింగ్రా చేర‌నున్నారు.

ఛాన్స‌ల‌ర్ రిషి సున‌క్ ఇలా అన్నారు. అంత‌ర్జాతీయ ఆర్థిక శాస్త్రంలో డాక్ట‌ర్ స్వాతి ధింగ్రా అనుభవం మానిట‌రీ పాల‌సీకి అద‌న‌పు బ‌లాన్ని ఇస్తుంద‌న్నారు. స్వాంతి(Swati Dhingra)ని నియ‌మించినందుకు తాను సంతోషిస్తున్న‌ట్లు తెలిపారు.

రాబోయే సంవ‌త్స‌రాల‌లో విధాన రూప‌క‌ల్ప‌న‌లో ఆమె స‌హ‌కారం కోసం ఎదురు చూస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా స్వాతి ధింగ్రా స్పందించారు. యుద్దం, ప్ర‌పంచ స‌వాళ్ల మ‌ధ్య తాను ఈ ప‌ద‌వి చేప‌ట్ట‌డం ఓ స‌వాల్ గా భావిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : హిజాబ్ పేరుతో హ‌క్కుల ఉల్లంఘ‌న

Leave A Reply

Your Email Id will not be published!