Swati Maliwal : ‘బాబా’ నిర్వాకం మ‌హిళా క‌మిష‌న్ ఆగ్ర‌హం

చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ సీరియ‌స్

Swati Maliwal : మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ యోగా గురు రాం దేవ్ బాబాపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ప్ర‌స్తుతం బాబా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. మ‌హిళ‌లు చీర‌ల్లో అందంగా ఉంటారు. స‌ల్వార్ క‌మీజుల్లో కూడా సూప‌ర్. అయితే బ‌ట్ట‌లు లేకుండా కూడా ఇంకా అద్భుతంగా ఉంటారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన స‌మ‌యంలో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృత ఫ‌డ్న‌వీస్ కూడా ఉండ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌తంలో కూడా రాం దేవ్ బాబా ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి చివ‌ర‌కు త‌ప్పు ఒప్పుకున్నారు. మ‌న్నించ‌మ‌ని కోరారు. క‌రోనా క‌ష్ట కాలంలో విశిష్ట సేవ‌లు అందించిన వైద్యుల‌పై కూడా నోరు పారేసుకున్నారు.

తాజాగా టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రాతో పాటు ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్(Swati Maliwal) నిప్పులు చెరిగారు. సీరియ‌స్ గా స్పందించారు. ఇదిలా ఉండ‌గా 2011లో మ‌హిళా వేషంలో రాందేవ్ బాబా రాం లీలా మైదానం నుంచి ఎందుకు పారి పోయారో ఇప్పుడు అర్థం అవుతోందంటూ మండిప‌డ్డారు.

స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా స్త్రీల ప‌ట్ల ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట క‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరారు స్వాతి మ‌లివాల్.

యోగా గురు త‌న వ్యాఖ్య‌లకు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దేశ ప్ర‌జ‌లంద‌రి మ‌నో భావాల‌ను దెబ్బ తీసిన బాబాపై చ‌ర్య‌లు తీసుకునేంత వ‌ర‌కు వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Also Read : ‘బాబా’ వికారం మ‌హిళ‌ల‌పై వెట‌కారం

Leave A Reply

Your Email Id will not be published!