Swati Piramal : సక్సెస్ కు కేరాఫ్ స్వాతి పిరామల్
అత్యున్నత ఫ్రెంచ్ పురస్కారం
Swati Piramal : దేశం గర్వించేలా స్వాతి పిరామల్ నిలిచారు. ఆమె అత్యున్నతమైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని పొందారు. పిరామల్ గ్రూప్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ది చెవాలియర్ డి లా లెజియన్ డి హూన్నూర్ అవార్డు. ఇది ఫ్రాన్స్ దేశంలో కీలకమైన పురస్కారం. దీనికి ఎంపికైన భారతీయురాలు స్వాతి పిరామల్(Swati Piramal) .
చాలా మంది మహిళలు సైన్స్ , టెక్నాలజీ, ఇంజనీరింగ్ , మ్యాథ్స్ ఎంచుకుంటే స్వాతి పిరామల్ మాత్రం వైద్య రంగాన్ని ఎంచుకుంది. ఆమె ఇదే రంగంలో 40 ఏళ్లకు పైగా ఉన్నారు. మేధోసంపత్తి ప్రాముఖ్యతను సమర్థించే సమయంలో స్వాతి పిరామల్ చాలా ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. దేశంలో ఆరోగ్య కారణాల కోసం న్యాయవాదిగా మారేందుకు తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. కొత్త మందులు, ప్రజారోగ్య సేవలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు.
గత మూడు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఖర్చుతో కూడుకున్న , సైన్స్ ఆధారిత ఆరోగ్య సంరక్షణను అందించినందుకు గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు స్వాతి పిరామల్(Swati Piramal) . ఔషధ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఏర్పడింది. పిరామల్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఆమె తనదైన ముద్ర కనబర్చారు.
కొన్నేళ్లుగా స్వాతి పిరామల్ వ్యాపారం, సైన్స్ , మెడిసన్ , కళలు , సంస్కృతి, ఇండో ఫ్రెంచ్ సంబంధాలకు చేసిన అపారమైన కృషికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా స్వాతి పిరామల్ చేసిన వ్యాఖ్యలు స్పూర్తి దాయకంగా ఉన్నాయి.
ఆనందం, శాంతిని కలిగించే వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. అదే మీ విజయానికి కారణం అవుతుందని అంటారు స్వాతి పిరామల్.
Also Read : క్రియేటివిటీలో సప్నా కిర్రాక్