T Natarajan : తమిళనాడుకు చెందిన టి. నటరాజన్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. యార్కర్లు వేయడంలోనే కాదు బంతిని అద్భుతంగా తిప్పడంలో మోస్ట్ పాపులర్ . భారత పేసర్లలో ఒకడిగా పేరొందాడు. ఆస్ట్రేలియా సీరీస్ లో సత్తా చాటాడు.
తాజాగా ఐపీఎల్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ముందుగా బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు. రాణా 54, రస్సెస్ 49, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేసి కీలక పాత్ర పోషించారు.
కానీ పరుగులు చేయలేక చతికిల పడ్డారు. నటరాజన్ (T Natarajan)మెరుపుల్లాంటి బంతులతో మెస్మరైజ్ చేశాడు. స్వల్ప వ్యవధిలోనే వికెట్లు తీస్తూ కేకేఆర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు హైదరాబాద్ బౌలర్లు.
ఐదు ఓవర్లు ముగిసే లోపే ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్ కు పంపారు. ఇక సన్ రైజర్స్ లో నటరాజన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ రెండు, భువనేశ్వర్ కుమార్ , మార్కో జాన్ సన్ , సుచిత్ చెరో వికెట్ తీసి సత్తా చాటారు.
నటరాజన్ మరోసారి బౌలింగ్ కు ఉన్న పవర్ ఏమిటో చూపించాడు. రన్నింగ్ ఎక్స్ ప్రెస్ లాగా దూసుకు వస్తున్న బంతుల్ని ఆడేందుకు జడుసుకున్నారు కేకేఆర్ బ్యాటర్లు.
సన్ రైజర్స్ సిఇఓ ఈసారి రిటైన్ చేసుకున్న బౌలర్లలో నటరాజన్ (T Natarajan) ఒకడు. తమ ప్రాంతానికే చెందిన వాడు కావడం కూడా కలిసొచ్చింది. ఏది ఏమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో గాడిన పడడం ఒకందుకు మంచిదేనని చెప్పక తప్పదు.
Also Read : టెస్టు కెప్టెన్సీకి జో రూట్ గుడ్ బై