T Natarajan : బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన ‘న‌ట్టూ’

4 ఓవ‌ర్లు 10 ప‌రుగులు 3 వికెట్లు

T Natarajan : త‌మిళ‌నాడుకు చెందిన న‌ట‌రాజ‌న్ అలియాస్ న‌ట్టూ త‌న స‌త్తా ఏమిటో రుచి చూపించాడు. ఐపీఎల్ 2022లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో నట్టూ దెబ్బ‌కు వ‌ర‌ల్డ్ స్టార్ ప్లేయ‌ర్లు విల‌విల‌లాడారు.

ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. త‌ట్టుకోలేక వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు. బంతులు ఎలా వ‌స్తాయో అర్థం చేసుకోలేక పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ విలియ‌మ్స‌న్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇంకేం త‌మ నాయ‌కుడు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు. ఎస్ఆర్హెచ్ బౌల‌ర్లంతా వికెట్లు తీసేందుకు పోటీ ప‌డ్డారు. వీరి దెబ్బ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన టాప్ బ్యాట‌ర్లంతా బెంబేలెత్తి పోయారు.

మిస్సైల్లాంటి బంతుల్ని విసురుతుంటే ఎదుర్కోలేక పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. బ్యాటింగ్ లో అభిషేక్ శ‌ర్మ 47 ర‌న్స్ చేస్తే మార్కో జాన్స‌న్ 4 ఓవ‌ర్లు వేసి 25 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

ఇదే టి. న‌ట‌రాజ‌న్ 4 ఓవ‌ర్లు వేసి కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక‌కు చెందిన హ‌స‌రంగ క‌ళ్లు చెదిరే లోపే వికెట్ ను పారేసుకున్నాడు.

త‌ను ఆడుదామ‌ని అనుకున్న స‌మ‌యంలోనే న‌ట్టూ(T Natarajan) బాల్ వ‌చ్చి నేరుగా వికెట్ ను తాకింది. అల్లంత దూరాన ప‌డి పోయింది. దాంతో విస్తు పోవ‌డం హ‌స‌రంగ ప‌నైంది.

వ‌రుస‌గా 8 మ్యాచ్ లు ఆడిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మూడు మ్యాచ్ ల‌లో ఓడి పోయి వ‌రుస‌గా 5 మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

Also Read : మార్కో మామూలోడు కాద‌ప్పా

Leave A Reply

Your Email Id will not be published!